AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా హీరో అంటే చాలా ఇష్టం.. అతని సినిమా చూశాకే హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యా: యంగ్ బ్యూటీ

రీసెంట్ డేస్ లో ఓ చిన్నది టాలీవుడ్ లో తెగ సందడి చేస్తుంది. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది ఈ భామ. త్వరలోనే ఈ చిన్నది నటించనున్న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా హీరో సినిమా చూసి హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యా అని తెలిపింది.

మెగా హీరో అంటే చాలా ఇష్టం.. అతని సినిమా చూశాకే హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యా: యంగ్ బ్యూటీ
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: May 21, 2025 | 9:28 AM

Share

టాలీవుడ్ లోకి కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. చాలా మంది హీరోయిన్స్ తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కొత్త కొత్త హీరోయిన్స్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలీవుడ్ నుంచే కాదు కోలీవుడ్ నుంచి కూడా చాలా మంది హీరోయిన్స్ తెలుగులో సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తెలుగులో సినిమా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ లో ఈ చిన్నది ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఓ స్టార్ హీరో సినిమా చూసి తాను హీరోయిన్ గా మారాను అని తెలిపింది. ఇంతకూ ఆ యంగ్ బ్యూటీ ఎవరో.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.?

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది నటిగా, నిర్మాతగా, అలాగే గాయినిగాను చాలా ఫెమస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరో కార్తీ నటించిన తమిళ చిత్రం విరుమాన్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నటన పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

అలాగే శివకార్తికేయన్ హీరోగా నటించిన మహావీరన్ సినిమాలోనూ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమానే తెలుగులో మహావీరుడుగా రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు భైరవం అనే సినిమాతో రాబోతుంది. టాలీవుడ్ యంగ్ హీరోలు, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఈ చిన్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ భామ మాట్లాడుతూ.. తాను మొదట థియేటర్లో చూసిన మూవీ మగధీర అని తెలిపింది. రామ్ చరణ్ తన ఫెవరేట్ హీరోయిన్ అని తెలిపింది. ఇక మగధీర చూశాకా గూస్‌బంప్స్‌ వచ్చేలా ఉందని తన ఆనందం వ్యక్తం చేసింది. మగధీర మూవీ చూశాకే హీరోయిన్ అవ్వాలని డిసైడ్ ‍అయ్యానని ఆదితి శంకర్ తెలిపింది ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు