అవకాశాలు రావడం లేదు… ఖాళీగా ఉన్నా అని పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ క్రేజీ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎన్నో ఏళ్లు పడుతుంది సినిమాల్లో ఛాన్స్ రావడానికి.. కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి ఇట్టే హీరోయిన్స్ అవుతూ ఉంటారు. కానీ ఈ స్టార్ హీరోయిన్ కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు అని తెలిపింది.

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత కెరీర్ స్లో అవుతుంది. ఆశించిన స్థాయిలో అవకాశాలు రావు. కొంతమంది హీరోయిన్స్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు అని తెలిపింది. ఓ సూపర్ హిట్ సినిమా తర్వాత తనకు అవకాశాలు రాకుండా పోయాయి అని తెలిపింది. అలాగే ఆ సినిమాలో తన నటనకు విమర్శల ప్రశంసలు దక్కినా కూడా తనకు అవకాశాలు రాలేదని, దర్శక నిర్మాతలు తనకు అవకాశాలు ఇవ్వడం లేదని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది.
ఆమె ఎవరో కాదు అదితి రావు హైదరి. ఈ ముద్దుగుమ్మ హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తుంది. ఆమె 1978 అక్టోబర్ 28న హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లి విద్యా రావు, ఒక ప్రముఖ శాస్త్రీయ గాయని, తండ్రి ఎహ్సాన్ హైదరి. అదితి రాజకీయంగా ప్రముఖమైన కుటుంబాల నుండి వచ్చింది. ఆమె తాత జె. రామేశ్వర రావు వనపర్తి సంస్థానానికి చెందిన రాజా, మరియు ఆమె ముత్తాత సర్ అక్బర్ హైదరి హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇక అదితి తన సినీ ప్రస్థానాన్ని 2006లో మలయాళ చిత్రం “ప్రజాపతి”తో ప్రారంభించింది. ఇందులో ఆమె మమ్ముట్టి సరసన నటించింది.
ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. హిందీలో “దిల్లీ 6”, “రాక్‌స్టార్”, “పద్మావత్” వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె గుర్తింపు పొందింది. తెలుగులో “సమ్మోహనం”, “మహాసముద్రం” వంటి సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన “కాట్రు వెలియిడై” ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదితి కేవలం నటి మాత్రమే కాదు భరతనాట్యం నృత్యంలో శిక్షణ పొందిన నర్తకి కూడా. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆమె 17 ఏళ్ల వయసులో నటుడు సత్యదీప్ మిశ్రాను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ వారు 2013లో విడిపోయారు. ఆ తర్వాత, నటుడు సిద్ధార్థ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2024లో తెలంగాణలోని వనపర్తి జిల్లాలో శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. తాజాగా అదితి మాట్లాడుతూ.. హీరమండి సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయని తెలిపింది. కానీ ఈ సినిమా తర్వాత తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు అని తెలిపింది. నా నటనకు , డాన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఆ ఖాళీ సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా అని తెలిపింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.