Adipurush: ఆదిపురుష్ త్రీడీ టీజర్‌కు ట్రెమండర్స్ రెస్పాన్స్.. సినిమా నెక్స్ట్ లెవల్‌లో ఉంటదంటున్న ఫ్యాన్స్

|

Oct 08, 2022 | 6:22 PM

తాజాగా ఈ సినిమా త్రీడీ వెర్షన్ టీజర్ ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 60 థియేటర్ లలో రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను త్రీడీ ఫార్మేట్ లో చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.

Adipurush: ఆదిపురుష్ త్రీడీ టీజర్‌కు ట్రెమండర్స్ రెస్పాన్స్.. సినిమా నెక్స్ట్ లెవల్‌లో ఉంటదంటున్న ఫ్యాన్స్
Adipurush
Follow us on

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఇతిహాసిక చిత్రం ఆదిపురుష్. చాలా కాలంగా ప్రభాస్ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా నిరాశపరచడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆదిపురుష్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అయితే ఈ టీజర్ పై రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారంటూ కొందరు ఈ టీజర్ పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా త్రీడీ వెర్షన్ టీజర్ ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 60 థియేటర్ లలో రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను త్రీడీ ఫార్మేట్ లో చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.

టీజర్ గూస్ బంప్స్, త్రీడీలో టీజర్ ను బాగా ఎంజాయ్ చేశాం, టీజర్ చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా  ఉండబోతుందో అర్థమవుతోంది..అంటూ వాళ్లు తమ ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టీజర్ ను అయోధ్య నగరంలో విడుదల చేసిన టీమ్..త్రీడీ వెర్షన్ టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రభాస్ అండ్ మూవీ టీమ్.. ప్రేక్షకులు, అభిమానుల కోసం పలు థియేటర్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేసింది. ఈ స్క్రీనింగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ఇక  ఆదిపురుష్ టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు తిరగరాస్తోంది. ఇక రీసెంట్ గా త్రీడీ టీజర్ రిలీజ్ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ, “మొదటిసారి మా టీజర్ ని త్రీడీలో చూస్తూ చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యాను. అభిమానుల కోసం 60 థియేటర్లలో త్రీడీ టీజర్ వేస్తున్నాం. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. మీ అందరి అభిమానం, ఆశీస్సులు మాకు కావాలి .రానున్న 10 రోజుల్లో మరింత మంచి కంటెంట్ తో మీ ముందుకి వస్తున్నాం.” అన్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమయ్యారు. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్ లో వచ్చే సంక్రాంతి పండక్కి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.