
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో చిన్నప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యింది అవికా గోర్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాల అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది. లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మామ, రాజుగారి గది 3, థ్యాంక్యూ తదితర సినిమాల్లో కథానాయికగా మెప్పించింది. పలు వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ కన్నడ, హిందీ లో కూడా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తూనే నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుంది అవికా గోర్. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ అందాల తార గత ఆరేళ్లుగా మిలింద్ చాంద్వాని అనే వ్యాపారవేత్తతో ప్రేమలో మునిగితేలుతోంది. తమ ప్రేమ విషయాన్ని కూడా ఎప్పుడో అధికారికంగా ప్రకటించారీ లవ్ బర్డ్స్. ఇక ఈ ఈ ఏడాది జూన్ లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 30) అవిక- మిలింద్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబై వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం అవికా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.
2019లో సామాజిక కార్యకర్త అయిన మిలింద్‌ని ఓ సందర్భంలో కలిసింది అవికా. అప్పటి నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆ తర్వాత ఇద్దరి అభిరుచులు, మనసులు కలవడంతో ప్రేమికులుగా మారిపోయారు. 2020 నుంచి ప్రేమలో ఉన్న వీరు ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం షణ్ముఖ అనే సినిమాలో నటిస్తోంది అవికా గోర్. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.
Balika Vadhu actor Avika Gor ties a knot with Milind Chandwani 😍😍 Congratulations to the newly wed couple 🫶🏻🫶🏻 #avikagor #milindchandwani #balikavadhu #bollywood #celebrity pic.twitter.com/LuBbKybEcK
— Manas Bollywood (@Manasbollywood) September 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.