Vishnu Priya: ‘లవ్యూ అమ్మా.. ప్లీజ్ మళ్లీ రావా’.. తల్లి పుట్టిన రోజున స్టార్ యాంకర్‌ విష్ణుప్రియ ఎమోషనల్‌

బుధవారం (ఫిబ్రవరి 15) యాంకర్ తల్లి పుట్టినరోజు. ఈ సందర్భంగా అమ్మతో గడిపిన మధుర క్షణాలు, జ్ఞాపకాలను గుర్తుచేసుకుందీ స్టార్‌ యాంకర్‌. తన లేని లోటు ఎవరూ తీర్చలేరంటూ సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేసింది.

Vishnu Priya: లవ్యూ అమ్మా.. ప్లీజ్ మళ్లీ రావా.. తల్లి పుట్టిన రోజున స్టార్ యాంకర్‌ విష్ణుప్రియ ఎమోషనల్‌
Actress Vishnu Priya

Edited By: Ravi Kiran

Updated on: Feb 16, 2023 | 6:18 PM

నిత్యం ఎనర్జిటిక్‌గా, ఫుల్‌ జోష్‌లో కనిపించే స్టార్‌ యాంకర్ విష్ణుప్రియ కొద్ది రోజులుగా తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. సోషల్‌ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది. ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వట్లేదు. గత నెలలో ఆమె తల్లి కన్నమూయడమే విష్ణుప్రియ ఆవేదనకు కారణం. అయితే బుధవారం (ఫిబ్రవరి 15) యాంకర్ తల్లి పుట్టినరోజు. ఈ సందర్భంగా అమ్మతో గడిపిన మధుర క్షణాలు, జ్ఞాపకాలను గుర్తుచేసుకుందీ స్టార్‌ యాంకర్‌. తన లేని లోటు ఎవరూ తీర్చలేరంటూ సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేసింది. ‘నీ ప్రేమ, ఎనర్జీని ఎవ్వరూ భర్తీ చేయలేరు. నా డార్లింగ్‌ ఏంజెల్‌ను ఇప్పటికీ, ఎప్పటికీ మిస్‌ అవుతాను. లవ్‌ యూ అమ్మ’ అని అమ్మపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది. దీంతో పాటు ‘నా లైఫ్‌లో ఆ ఒక్క మహారాణి మా అమ్మ మాత్రమే’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను వీడియోలో జత చేసింది. కాగా జనవరి 26న విష్ణుప్రియ తల్లి హఠాన్మరణం చెందారు. ‘మై డియర్ అమ్మ.. ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నేను తుది శ్వాస విడిచే వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం.. నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించడానికి నువ్వు ఎన్ని ఇక్కట్లు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా..’ అని ఆ సందర్భంలో కన్నీరుమున్నీరైంది విష్ణుప్రియ.

కాగా తన తల్లిని గుర్తుచేసుకుంటూ విష్ణుప్రియ షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు బుల్లితెర ప్రముఖులు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక కెరీర్‌ విషయానికొస్తే.. ఒక యూట్యూబర్‌గా కెరీర్‌ ప్రారంభించిన విష్ణుప్రియ పోవే పోరా షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన అల్లరి, హంగామానూ ఎవరూ మర్చిపోలేరు. పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే నటిగానూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడు సినిమాలో ఓ హీరోయిన్ గా నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసంక్లిక్ చేయండి..