NBK 107: బాలయ్యతో సై అంటున్న జయమ్మ.. ఎన్బీకే 107లో కీలక పాత్రలో వరలక్ష్మీ..
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను... బాలయ్య కాంబోలో
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను… బాలయ్య కాంబోలో వచ్చిన ఈ మూవీ సెన్సెషన్ క్రియేట్ చేసింది. దీంతో బాలయ్య ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రవితేజ ప్రధాన పాత్రలో క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు గోపిచంద్ మలినేని. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా రూపొందుతుంది.
ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. సెట్స్ పైకి ఆమెకు ఆహ్వానం పలుకుతూ చిత్రయూనిట్ వరలక్ష్మీ పోస్టర్ రిలీజ్ చేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాట తిరుగులేని లేడీ విలన్ పాత్రలో అదరగొడుతుంది. నెగిటివ్ షెడ్స్ లో హీరోలకు ధీటుగా నటించి మెప్పిస్తోంది వరలక్ష్మీ. తెలుగులో క్రాక్, తెనాలి రామకృష్ణ వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా బాలయ్యను ఢీ కొట్టేందుకు సిద్ధమైంది జయమ్మ. ఇక ఇదివరకే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ను తీసుకుంటున్నట్లుగా అనౌన్స్ చేశారు.
Team #NBK107 welcomes the most talented & versatile actress @varusarath5 on board ??
NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @megopichand @MusicThaman pic.twitter.com/0KjcvVtsKZ
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2022
Also Read: Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..
Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి