Anupama Parameswaran: లవ్ బ్రేకప్ గురించి హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. కానీ.. ప్రేమను గుర్తుచేసుకోనంటూ..
ప్రేమమ్ సినిమాతో మలయాళం ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్
ప్రేమమ్ సినిమాతో మలయాళం ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆతర్వాత ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగు ప్రేమమ్ లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా.. తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అనుపమ. ఈ అమ్మడు నటిస్తోన్న చిత్రాలు రౌడీ బాయ్స్, కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అనుపమ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమా కోసం భావోద్వేగాలు పండించేటప్పుడు ఆయా కథలే ప్రభావితం చేస్తుంటాయి తప్ప.. నా వ్యక్తిగత జీవితాన్ని అస్సలు గుర్తుకు తెచ్చుకోనని చెప్పింది అనుపమ.. ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ” నటుల జీవితాలపై తప్పకుండా వృత్తి ప్రభావం ఎంతోకొంత ఉంటుంది. కొన్ని పాత్రలు చేసి బయటకొచ్చిన తర్వాత అవి మనసుల్ని వెంటాడుతుంటాయి. అయితే చాలా వరకు రెండు జీవితాలను వేర్వేరుగా ఉండేలా చూసుకుంటుంటా. కెమెరా ముందుకు వెళ్లానంటే ఆయా కథలు, పాత్రలే ప్రపంచంగా మారిపోతుంటా. ఆ పాత్ర సంఘర్షణ నుంచే భావోద్వేగాల్ని పండించేందుకు ప్రయత్నిస్తుంటా. అంతేకానీ.. నా వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేసుకుని నటించే ప్రయత్నం చేయను.
నిజ జీవితంలో నేను ప్రేమలో పడ్డాను.. విడిపోయాను. అలాగని సెట్లో ప్రేమ సన్నివేశాల్లో నటించేటప్పుడు నా ప్రేమను గుర్తుచేసుకోను. అలా అలవాటు పడితే కష్టమని నా ఉద్ధేశ్యం. కథల్లోని ప్రతీ సంఘర్షణ నా జీవితంలో ఉండదు కదా. ఇప్పటివరకు ఆయా కథలు.. పాత్రలే నాకు ఎక్కువ జీవితాన్ని పరిచయం చేశాయి ” అంటూ చెప్పుకొచ్చింది అనుపమ.
Also Read: Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి