AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hari Teja: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విషెస్..

హరితేజ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో హరితేజ ఒకరు. త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అఆ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హరి తేజ. ఆ సినిమాలో సమంత ఇంటిపనిమనిషిగా నటించి కామెడీ పండించింది హరితేజ.

Hari Teja: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విషెస్..
Hariteja
Rajeev Rayala
|

Updated on: Apr 07, 2021 | 12:49 PM

Share

Hari Teja: హరితేజ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో హరితేజ ఒకరు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హరి తేజ. ఆ సినిమాలో సమంత ఇంటిపనిమనిషిగా నటించి కామెడీ పండించింది హరితేజ. ఆ తర్వాత తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది హరితేజ. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన  హరితేజ తనదైన అల్లరితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలోను నటించి ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాలోను కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు హరితేజ.  రీసెంట్‌గా ”అల్లుడు అదుర్స్, జాంబి రెడ్డి” సినిమాల్లో కనిపించారు హరితేజ. తాజాగా హరితేజ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవల తాను కన్సీవ్ అయ్యాను అంటూ హరితేజ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. సోషల్ మీడియాలో ఖాతాల్లో బేబీ బంప్‌తో దిగిన ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉన్నారు. తాజాగా తనకు ఆడ బిడ్డ పుట్టిందనే విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా స్వయంగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు హరి తేజ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Niharika Konidela : గులాబీ దుస్తుల్లో గుభాళించిన సోయగం.. నిహారిక ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు

RGV Birthday: ఆయన పేరు ఓ సంచలనం..ఆయన మాట ఓ వివాదం..ది గ్రేట్ రామ్‌గోపాల్ వర్మ

Vakeel Saab Actress Ananya Nagalla: పవన్ కళ్యాణ్‌‌‌‌తో జరిగిన డిస్కషన్స్ ఎప్పటికీ మర్చిపోలేనంటున్న హీరోయిన్..