Trisha: త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు.. స్పందించిన స్టార్‌ హీరోయిన్‌

|

Feb 21, 2024 | 10:13 AM

స్టార్ హీరోయిన్‌ త్రిషపై ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్‌ చేసిన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. చిరంజీవి, ఖుష్బూ, మీనా లాంటి స్టార్‌ హీరోయిన్లు మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి హైకోర్టు దాకా ఈ విషయం వెళ్లింది. మన్సూర్ కు మొట్టికాయలు కూడా వేసింది న్యాయస్థానం. అయినా కొందరికి ఏ మాత్రం బుద్ధి రావడం లేదు.

Trisha: త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు.. స్పందించిన స్టార్‌ హీరోయిన్‌
Av Raju, Trisha
Follow us on

స్టార్ హీరోయిన్‌ త్రిషపై ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్‌ చేసిన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. చిరంజీవి, ఖుష్బూ, మీనా లాంటి స్టార్‌ హీరోయిన్లు మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి హైకోర్టు దాకా ఈ విషయం వెళ్లింది. మన్సూర్ కు మొట్టికాయలు కూడా వేసింది న్యాయస్థానం. అయినా కొందరికి ఏ మాత్రం బుద్ధి రావడం లేదు. తాజాగా త్రిషపై, అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నుంచి త్రిష రూ.25 లక్షలు తీసుకున్నారని చెప్పడంతో పాటు రాయడానికి వీలు లేని అభ్యంతరకర కామెంట్లు చేశాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమాన్లు, నెటిజన్లు ఏవీ రాజుపై మండి పడుతున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా త్రిష కూడా ఏవీ రాజు కామెంట్స్ పై స్పందించింది. ఇలాంటి నీచమైన మనుషులను పదేపదే చూడడం అసహ్యంగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. అన్నాడీఎంకే మాజీ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సోషల్‌ మీడియా వేదికగా హెచ్చరించింది.

‘నలుగురి దృష్టిని ఆకర్షించేందుకు ఏ స్థాయికైనా దిగజారిపోయే హేయమైన మనుషులను, నీచమైన జీవితాలను పదేపదే చూడడం ఎంతో అసహ్యంగా ఉంది. కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాను. మిగిలినది నా లీగల్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటుంది” అని ట్వీట్‌ చేసింది త్రిష. కాగా పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏవీ రాజును ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించింది. అయినా అతను తీరు మార్చుకోలేదు. త్రిషపై ఏవీ రాజు చేసిన కామెంట్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. విశాల్‌ తో సహా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ఈ కామెంట్స్ పై మండి పడుతున్నారు. త్రిషకు అండగా ఉంటామంటూ మద్దతు ప్రకటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

త్రిష రియాక్షన్ ఇదే..

త్రిషకు మద్దతుగా విశాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.