Ponniyin Selvan: అంతఃపురంలో అందాల యువరాణి కుందవై.. మణిరత్నం సినిమాలో త్రిష లేటేస్ట్ ఫోటో అదుర్స్..

|

Jul 07, 2022 | 12:46 PM

ఇప్పటికే విక్రమ్, కార్తీ, ఐశ్వర్య పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా హీరోయిన్ త్రిష పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు విడుదలైన పోస్టర్ లో త్రిష అందాల యువరాణిగా..

Ponniyin Selvan: అంతఃపురంలో అందాల యువరాణి కుందవై.. మణిరత్నం సినిమాలో త్రిష లేటేస్ట్ ఫోటో అదుర్స్..
Trisha
Follow us on

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan) . ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‏గా భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష (Trisha Krishnan), కార్తీ, విక్రమ్, జయం రవి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న గ్రాండ్‏గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే విక్రమ్, కార్తీ, ఐశ్వర్య పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా హీరోయిన్ త్రిష పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు విడుదలైన పోస్టర్ లో త్రిష అందాల యువరాణిగా.. రాయల్టీ లుక్‏లో మరింత అందంగా కనిపిస్తోంది. పురుషుల ప్రపంచంలో ధైర్యం ఉన్న స్త్రీ. యువరాణి కుందవై అంటూ ఆమె పాత్రను పరిచయం చేస్తూ త్రిష పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారు. ఇక బుధవారం ఐశ్వర్య పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రతీకారం తీర్చుకునే రాణి నందిని పాత్రలో ఐశ్వర్య కనిపించనుంది. పట్టు చీర, పొడవాటి జుట్టు.. మెడలో ఆభరణాలతో చూపుతిప్పుకొనివ్వకుండా.. ప్రేక్షకులను మరింత మంత్రముగ్దులను చేస్తుంది ఐశ్యర్య లుక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.