Tollywood : మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్.. నెటిజన్స్ విమర్శలు.. అసలేం జరిగిందంటే..

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన ఈ జాతరకు అన్నివర్గాల ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ సైతం మేడారం జాతరలో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ షాలో షేర్ చేసింది.

Tollywood : మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్.. నెటిజన్స్ విమర్శలు.. అసలేం జరిగిందంటే..
Teena Sravya

Updated on: Jan 21, 2026 | 9:39 AM

తెలంగాణ రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన మేడారం జాతర సందడి మొదలైంది. ఈనెల 28 నుంచి 31 వరకు ఈ జాతర జరగనుంది. కానీ ఇప్పటికే జాతరకు వందల సంఖ్యలో భక్తులు హాజరై సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటున్నారు. నెల రోజుల ముందు నుంచే గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య సైతం మేడారం జాతరలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇన్ స్టాలో షేర్ చేశారు. కానీ ఆమె తీరుపై పలువురు నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. టీనా శ్రావ్య.. ఇప్పుడిప్పుడే తెలుగులో గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

కమిటీ కుర్రోళ్లు, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న శ్రావ్య.. ఇటీవల మేడారం జాతరకు వెళ్లింది. అక్కడ చాలా మంది తమ బరువంతా బెల్లం దేవతలకు మొక్కుగా సమర్పించుకుంటారు. తాజాగా హీరోయిన్ టీనా శ్రావ్య సైతం తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చొపెట్టి సమ్మక్క, సారలమ్మకు బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియోను ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

అయితే టీనా శ్రావ్య చేసిన పనికి విభిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమె చేసిన పనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొక్కులో భాగంగానే ఇలా చేశామని అంటున్నారు టీనా శ్రావ్య తల్లి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..