Tamannaah: క‌రోనా సెకండ్ వేవ్‌తో ద‌య‌చేసి జాగ్ర‌త్త‌గా ఉండండి.. స్వీయ అనుభ‌వాన్ని పంచుకున్న త‌మ‌న్నా..

|

May 31, 2021 | 7:52 AM

Tamannaah: క‌రోనా సెకండ్ భార‌త్‌ను అతలాకుతలం చేస్తోంది. మొద‌టి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో మ‌ర‌ణాల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోయాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు, ఆక్సిజ‌న్ ల‌భించ‌క మ‌ర‌ణాలు...

Tamannaah: క‌రోనా సెకండ్ వేవ్‌తో ద‌య‌చేసి జాగ్ర‌త్త‌గా ఉండండి.. స్వీయ అనుభ‌వాన్ని పంచుకున్న త‌మ‌న్నా..
Tamanna Shares Feeling About Corona
Follow us on

Tamannaah: క‌రోనా సెకండ్ భార‌త్‌ను అతలాకుతలం చేస్తోంది. మొద‌టి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో మ‌ర‌ణాల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోయాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు, ఆక్సిజ‌న్ ల‌భించ‌క మ‌ర‌ణాలు క‌రోనా సెకండ్ వేవ్ ప్రారంభంలోఎటు చూసినా భ‌యాన‌క స‌న్నివేశాలే క‌నిపించాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా గురించి ప్ర‌జ‌ల్లో అవగాహ‌న కల్పించేందుకు గాను సెల‌బ్రిటీలు సైతం ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా న‌టి త‌మ‌న్నా కూడా ప్ర‌జ‌ల్లో క‌రోనాపై అవ‌గాన క‌ల్పించారు. క‌రోనా విష‌యంలో త‌మ‌న్నా త‌న స్వీయ అనుభ‌వాన్ని పంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌మ‌న్నా మాట్లాడుతూ.. `క‌రోనా సెకండ్ వేవ్ త‌రుణంలో చోటుచేసుకున్న కొన్ని హృదయవిదారక ఘటనలు మనసుకు ఎంతో బాధ క‌లిగించాయి. క‌రోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో ఎన్నో క్లిష్టతరమైన సమస్యలను ఎదుర్కొన్నాం. కానీ కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రాణాంతకంగా మారి, అంద‌రినీ భయపెడుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న మరణాలు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. గత ఏడాది కోవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌ సమయంలో ఆగస్టులో నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. తర్వాత అక్టోబరులో నాకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. అంటే.. మా తల్లిదండ్రులకు కరోనా వచ్చిన నెల తర్వాతే నాకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. కానీ సెకండ్‌ వేవ్‌లో ప‌రిస్థితులు మారిపోయాయి. ఒక కుటుంబంలోని ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలితే, ఆ కుటుంబంలోని మిగతావారికి వెంటనే పాజిటివ్‌ వస్తోంది. అది కూడా వేరు వేరు లక్షణాలతో కరోనా సోకుతుండటం విచారకరం. అందుకే కరోనా నియంత్రణ చర్యలను పాటించండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి` అంటూ చెప్పుకొచ్చింది త‌మ‌న్నా.

Also Read: TTD has announced: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. ఇవాళ్టి నుంచి అలిపిరి మెట్ల మార్గం మూసివేత

అవన్నీ ఊహాగానాలే నమ్మొద్దు.. మహేష్ – రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Smoking Corona: మీరు స్మోక్ చేస్తారా.? వెంట‌నే మానేయండి.. క‌రోనా స‌మయంలో ఇది చాలా డేంజ‌ర్‌.. మ‌ర‌ణం సంభవించే ఛాన్స్‌..