
Tamannaah: మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార తమన్నా. తొలి సినిమాతోనే అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది అనతికాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్‌లోని అందరూ టాప్ యంగ్ హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ తన అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పలు చిత్రల్లోనూ నటించి మెప్పించింది. ఇక మారుతోన్న కాలానికి అనుగుణంగా కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లపై కూడా దృష్టి సారించిన తమన్నా.. ఆహా ఓటీటీ నిర్మించిన ’11th Hour’ వెబ్ సిరీస్‌లోనూ తళుక్కుమంది. ఇందులో ఓ కార్పొరేట్ ఆఫీస్ సీఈఓగా తమన్నా అద్భుత నటనను కనబరించింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోందీ చిన్నది.
ఇక తాజాగా తెలుగు, హిందీ భాషల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది తమన్నా. సినిమా పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది తమన్నా. తన సినిమాల విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం తమన్నాకు అలవాటు. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫొటో షూట్‌లకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకునే ఈ చిన్నది. తాజాగా పర్పుల్ కలర్ డ్రస్‌లో దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు ‘ఎగిరిపోతే బాగుంటుంది’ అనే అర్థం వచ్చేలా ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించిందీ బ్యూటీ. అందానికే అసూయ పుట్టేలా ఉన్న తమన్నా లేటెస్ట్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
Also Read: Nikhil Siddharth: చెప్పు తెగుద్ది.. అమెరికా అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ హీరో