
దక్షిణాది సినీరంగంలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కథానాయికగా మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమెకు తెలుగు, కన్నడ, తమిళం భాషలలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ అప్పుడే పారితోషికం భారీగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెనక్కు తగ్గినట్లు వార్తలు వినిపించాయి. నెమ్మదిగా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. అలాగే ఆమె నటించిన లేటేస్ట్ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. చాలా కాలంగా సినిమాలు ప్రకటించకుండా ఉండిపోయిన ఈ అమ్మడు.. ఇప్పుపుడ ఆదియోగి వద్ద జరిగిన శివరాత్రి వేడుకలలో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేయగా.. క్షణాల్లో వైరలవుతున్నాయి. పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదు.. శ్రీనిధి శెట్టి.
కేజీఎఫ్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది శ్రీనిధి శెట్టి. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యష్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 1, 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్టయ్యాయో చెప్పక్కర్లేదు. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా మెరిసింది శ్రీనిధి. ఈ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత అదే స్టార్ డమ్ కాపాడుకోలేకపోయింది. కేజీఎఫ్ తర్వాత ఆమె నటించిన సినిమా కోబ్రా. విక్రమ్ చియనా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు మరింత తగ్గిపోయాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఫోటోస్ షేర్ చేస్తుంటుంది ఈబ్యూటీ. తాజాగా ఆదియోగి వద్ద జరిగిన శివరాత్రి సంబరాల్లో పాల్గొన్నట్లు ఫోటోస్ పంచుకుంది.
అందులో చీరకట్టులో ఎంతో సంప్రదాయకంగా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఆమెను చూస్తున్నట్లు రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తెలుసు కదా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగులో అడుగుపెట్టనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నారు. అలాగే నాని హిట్ 3లోనూ నటిస్తుంది. కన్నడలో సుదీప్ సరసన నటిస్తుంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..