Simran: ‘నిన్ను ఎప్పటికీ మర్చిపోలేం’.. సిస్టర్‌ సూసైడ్‌పై సిమ్రాన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

ప్రస్తుతం స్పెషల్ రోల్స్‌తో సందడి చేస్తోన్న సిమ్రాన్‌ సోషల్‌ మీడియాలో తాజాగా ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. 20 ఏళ్ల క్రితం చనిపోయిన తన సోదరి మోనాల్‌ నావల్‌ను తల్చుకుంటూ భావోద్వేగానికి గురైంది. సిమ్రన్‌తో పాటు మోనాల్‌ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Simran: నిన్ను ఎప్పటికీ మర్చిపోలేం.. సిస్టర్‌ సూసైడ్‌పై సిమ్రాన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
Actress Simran

Updated on: Apr 16, 2023 | 6:46 AM

సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సరసన నటించిందామె. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. సౌత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఆమెకు బోలెడు మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ప్రస్తుతం స్పెషల్ రోల్స్‌తో సందడి చేస్తోన్న సిమ్రాన్‌ సోషల్‌ మీడియాలో తాజాగా ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. 20 ఏళ్ల క్రితం చనిపోయిన తన సోదరి మోనాల్‌ నావల్‌ను తల్చుకుంటూ భావోద్వేగానికి గురైంది. సిమ్రన్‌తో పాటు మోనాల్‌ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2000లో ‘ఇంద్ర ధనుష్‌’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పుడామె వయసు కేవలం 18 సంవత్సరాలే. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ సరసన ‘బద్రి’ మూవీ కథానాయికగా కనిపించింది. పార్వయ్‌ ఒండ్రే పోదుమే, లవ్‌లి, సుముదిరం తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చకుంది. తెలుగులో ‘ఇష్టం’ అనే సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నర్తించింది. హిందీలో కూడా ‘మా తుఘే సలామ్‌’ అనే సినిమా చేసింది.

సినిమాల్లో జెడ్‌ స్పీడ్‌లో దూసుకెళుతోన్న మోనాల్‌ 2002 ఏ‍ప్రిల్‌ 14న చెన్నైలోని తన ఇంట్లోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆమె చనిపోవటానికి సరైన కారణాలు ఇప్పటికీ తెలియలేదు కానీ ప్రేమ వ్యవహారంతోనే ఆమె సూసైడ్‌ చేసుకుందని వార్తలు వచ్చాయి. ఈక్రమంలో మోనాల్‌ చనిపోయి 20 ఏళ్లు గడిచింది. ఈ సందర్భంగా సిమ్రాన్‌ ఓ ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. తన చెల్లెలితో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘మా అందమైన చెల్లెలు మోనాల్‌పై ప్రేమకు గుర్తుగా.. నిన్ను ఎప్పుడూ మర్చిపోలేము’ అని భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం సిమ్రాన్‌ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..