
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. హీరోలతో సమానంగా క్యారెక్టర్ ఉండే కథలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తమ నటనతో ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినిమాల్లో హీరోయిన్స్ పాత్రల గురించి ఇప్పటికే చాలా మంది ఎన్నో రకాల కామెంట్స్ చేశారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఊహించని కామెంట్స్ చేసి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అలాంటి పాత్రలు చేయడం కంటే ఆంటీల పాత్ర చేయడమే బెటర్ అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఎందుకు ఆ కామెంట్స్ చేసిందంటే..
పనికిమాలిన పత్రాలు చేయడం కాంట్ ఆంటీ పాత్రలు చేయడం ఉత్తమం అన్న హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి సిమ్రాన్. సినిమాల్లో ఎదో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రలు చేయడం కంటే ఆంటీ పాత్రలు చేయడం బెటర్ అన్నారు సిమ్రాన్. రీసెంట్ గా ఆమె ఓ అవార్డుల వేదిక పై ఆమె మాట్లాడుతూ.. ఇటీవల నేను ఓ సినిమా చూశా.. ఆ సినిమాలో నటి నటన నన్ను ఆకట్టుకుంది. వెంటనే నేను ఆమెకు మెసేజ్ చేశా.. తన నటన బాగుంది అని తెలిపా.. కానీ ఆమె ఇచ్చిన రిప్లే చూసి షాక్ అయ్యా.. ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అని రిప్లే ఇచ్చింది. ఆ మెసేజ్ నన్ను చాలా బాధించింది. చిన్న తనంగా అనిపించింది.
ఇప్పుడు నేను ఆమెకు చెప్తున్నా.. సినిమాల్లో పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే.. ఆంటీ లేదా అమ్మ పాత్రలు చేయడం ఎంతో ఉత్తమం. ఏం పని చేసినా మనం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే మన పని కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతాం. దేనిని చులకనగా చూడకూడదు అంటూ చెప్పుకొచ్చారు సిమ్రాన్. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. సిమ్రాన్ ఏ హీరోయిన్ను ఉద్దేశించి అన్నదా అని ఆరా తీస్తున్నారు అభిమానులు. ఇక సిమ్రాన్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.