Shruti Haasan: తెల్ల రంగు దుస్తులు ఇష్టం లేదట.. శ్రుతి హాసన్ ఆసక్తికర కామెంట్స్..
మ్యాజికల్ 13 సంవత్సరాలు. నేను ఒక సినిమా కంటే ఎక్కువ చేస్తాను అనుకోలేదు. నేను ఇందుకోసం పుట్టలేదు. కానీ నేను దీనిని ప్రేమించడం నేర్చుకున్నాను. నా జీవితంలో గొప్ప ఆనందానికి కారణంగా మారింది సినిమా.

క్రాక్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చింది శ్రుతి హాసన్ (Shruti Haasan). చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి.. మాస్ మాహారాజా రవితేజ నటించిన క్రాక్ మూవీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శ్రుతికి వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో ఆద్య పాత్రలో నటిస్తోంది. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ఎన్బీకే 107 చిత్రంలోనూ నటిస్తోంది. ఇవే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మెగా 154 చిత్రంలోనూ కనిపించనుంది. ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కాస్త ఖాళీ సమయం దొరికితే నెట్టింట సందడి చేస్తుంది శ్రుతి. షూటింగ్ సెట్ ఫోటోస్, పర్సనల్ ఫోటోస్ షేర్ చేస్తూ.. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంది.
తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్లో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోస్ షేర్ చేస్తూ.. నేనెప్పుడూ తెల్ల రంగు దుస్తులలో అసౌకర్యంగా ఉంటాను. దేవకన్యలకు ఎక్కువ విలువ ఉందనుకుంటాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే శ్రుతి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 13 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన ఇన్ స్టాలో ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది.
View this post on Instagram
” మ్యాజికల్ 13 సంవత్సరాలు. నేను ఒక సినిమా కంటే ఎక్కువ చేస్తాను అనుకోలేదు. నేను ఇందుకోసం పుట్టలేదు. కానీ నేను దీనిని ప్రేమించడం నేర్చుకున్నాను. నా జీవితంలో గొప్ప ఆనందానికి కారణంగా మారింది సినిమా. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను. విజయం, వైఫల్యాలను ఎలా ఎదుర్కొవాలి.. ఆత్మవిశ్వాసంతో సందేహాలను ఎలా పరిష్కరించుకోవాలి.. అన్నింటికంటే ముఖ్యంగా కథలు చెప్పడం.. ఇవ్వడం.. గౌరవాన్ని అభినందించడం.. ఇలా చాలా నేర్చుకున్నాను.. నాకు లభించిన ప్రేమకు, ప్రశంసలకు నేనేప్పటికీ కృతజ్ఞురాలినే. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ పదమూడు సంవత్సరాల ప్రేమకు ధన్యవాదాలు ” అంటూ చెప్పుకొచ్చింది.
ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
