ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ హీరోలుగా చేస్తున్నారని తనకు తెలియదని.. షూటింగ్ ప్రారంభమయ్యాకే ఆ విషయం తెలిసిందన్నారు హీరోయిన్ శ్రియా (Shriya Saran). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో హీరోయిన్ శ్రియా కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికే వరల్డ్ వైడ్గా రూ.600 కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హీరో అజయ్ దేవగణ్ కీలకపాత్రలలో నటించగా.. అజయ్ దేవగణ్ కు జోడీగా సరోజిని పాత్రలో నటించి శ్రియా. తాజాగా ఆమె తన తదుపరి షూటింగ్ కోసం బెంగుళూరు వెళ్లింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఈ సందర్భంగా శ్రియా మాట్లాడుతూ.. రాజమౌళి సర్ దర్శకత్వంలో నేను మొదటి సారి చేసిన సినిమా ఛత్రపతి. అది నా కెరీర్లోనే సూపర్ హిట్. ఆ తర్వాత మళ్లీ చేయలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలకపాత్రలో నటించే అవకాశం వచ్చింది. అలా రాజమౌళి టీంతో కలిసి నటించడం సంతోషన్నించింది. రాజమౌళి సినిమా అనగానే ఒకే చెప్పాను.. నా పాత్ర.. నాతోపాటు ఎవరెవరు చేస్తున్నారు. హీరోహీరోయిన్స్ ఎవరు అనేది తెలుసుకోలేదు. షూట్ ప్రారంభమైన తర్వాత తెలిసిందే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు నటిస్తున్నారని తెలిసింది అని చెప్పుకొచ్చింది శ్రియా.
చరణ్, తారక్ ఇద్దరికీ ఇన్ని సంవత్సరాల తర్వాత హిట్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు చాలా ప్రయత్నిస్తున్నాను..మూవీ విడుదలైన సమయంలో నేను ముంబాయిలో ఉన్నాను. అక్కడ థియేటర్స్ హౌస్ ఫుల్.. ప్రస్తుతం బెంగుళూరులోనూ హౌస్ ఫుల్.. వచ్చేవారమైన ఆర్ఆర్ఆర్ టికెట్స్ దొరుకుతాయని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: Darja Teaser: దర్జా టీజర్ రిలీజ్.. చీరకట్టిన సివంగిగా మరోసారి అదరగొట్టిన అనసూయ..
Nagarjuna: శరవేగంగా ది ఘోస్ట్.. దుబాయ్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన నాగార్జున అండ్ టీం..
Swimming Benefits: స్విమ్మింగ్ చేస్తే బరువు తగ్గుతారా ?.. ఈ టిప్స్ ఫాలో అయితే ఖాయమంటున్న నిపుణులు..