Shriya Saran: ఇదే ప్రశ్న హీరోలను అడిగే దైర్యం మీకుందా..? సీరియస్ అయిన శ్రియ శరన్
గ్లామర్ పాత్రలోనే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలతో మెప్పించారు శ్రియ. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు తగ్గించారు. ప్రస్తుతం సహాయక పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లోనే కాదు తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ చిన్నది. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అలరించారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో శ్రియ శరన్ ఒకరు. దాదాపు టాలీవుడ్ లోని అందరు హీరోలతో నటించారు శ్రియ. అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది. గ్లామర్ పాత్రలోనే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలతో మెప్పించారు శ్రియ. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు తగ్గించారు. ప్రస్తుతం సహాయక పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లోనే కాదు తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ చిన్నది. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అలరించారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
పెళ్లితర్వాత శ్రియ సినిమాలు తగ్గించారు. భర్తతో కలిసి విదేశాల్లో షికార్లు కొడుతూ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంది. కూతురు పుట్టిన తర్వాత కూడా తరగని అందంతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తనను ప్రశ్నించిన జర్నలిస్ట్ పై ఫైర్ అయ్యింది శ్రియ.
ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ శ్రియను బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఇంత అందంగా ఎలా ఉన్నారు. మీ గ్లామర్ ను ఎలా మెయింటేన్ చేస్తుంటారు అని ప్రశ్నించారు. దీని పై శ్రియ ఫైర్ అయ్యారు. ఇదే ప్రశ్న మీరు హీరోలను అడిగే దైర్యం ఉందా..? అని సీరియస్ అయ్యారు శ్రియ. ‘నా స్నేహితులు చాలామంది బిడ్డ పుట్టాక కూడా మీరు ఇంత అందంగా ఉన్నారంటే నమ్మలేకపోతున్నాం అని అంటుంటారు. ఇక్కడ అందం ఒక్కటే ముఖ్యం అని నేను అనుకోను. నా వయసు.. నేను ఇండస్ట్రీలో ఎంత కాలం నుంచి ఉన్నాను? అనేదే చూసుకుంటాను. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు లేదు. ఈ ప్రశ్న హీరోలను అడిగిన రోజున నేను దీనికి ఆన్సర్ చెబుతా.. అని సీరియస్ అయ్యారు శ్రియ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.