Sharanya Pradeep: ఆ సీన్ నాభర్త మద్దతుతోనే చేశా.. కానీ పిచ్చి పిచ్చి థంబ్ నైల్స్ పెడుతున్నారు..
కొంతమంది ఎవ్వరూ చేయని సాహసాలు కూడా చేస్తుంటారు. కథకు అవసరమైతే రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటిస్తారు. కొందరు నగ్నంగానూ నటించడానికి వెనకాడరు. ఇప్పుడు అదే పని చేసింది ఓ నటి. ఆమె నటనకు ప్రశంసలు కురుస్తుంటే మరికొంతమంది మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే..

నటనకు ప్రాధాన్యత ఉన్న పత్రాలు దొరికితే హీరోయిన్స్ వందశాతం ఎఫర్ట్స్ తో చక్కటి నటనను కనబరుస్తూ ఉంటారు. కథకు అవసరమైతే ఎలాంటి సన్నివేషంలోనైనా నటించడానికి సిద్దమవుతుంటారు. కొంతమంది ఎవ్వరూ చేయని సాహసాలు కూడా చేస్తుంటారు. కథకు అవసరమైతే రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటిస్తారు. కొందరు నగ్నంగానూ నటించడానికి వెనకాడరు. ఇప్పుడు అదే పని చేసింది ఓ నటి. ఆమె నటనకు ప్రశంసలు కురుస్తుంటే మరికొంతమంది మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. ఫిదా సినిమాతో సాయి పల్లవి అక్కగా కనిపించింది నటి శరణ్య. ఆ సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించింది.
చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన శరణ్య రీసెంట్ గా సుహాస్ తో కలిసి అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో హీరో అక్క పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమాలో ఆమెను ఓ స్కూల్ లో వివస్త్రను చేసే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశం కొసం ఆమె నగ్నంగా ఉన్నట్టు చూపించారు. కానీ వాళ్లు అలా నటించారని మనకూ తెలుసు.
అయితే కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ ఆ సినిమాలోని సన్నివేశానికి అసభ్యకరంగా థంబ్ నైల్స్ పెట్టి వ్యూస్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారి పై మండిపడింది శరణ్య. ఇటీవలే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఇప్పటికే పెళ్లయింది. నా భర్త మద్దతుతోనే నేను ఆ సన్నివేశంలో నటించా అని తెలిపింది. నిజానికి సినిమాలో ఏం లేకపోయినా.. ఎదో ఉన్నట్టు పిచ్చి పిచ్చి థంబ్ నైల్స్ పెట్టి ఇబ్బంది కలిసాగిస్తున్నారు. చాలా వీడియోలకు రిపోర్ట్ కొట్టినా కూడా లాభం లేకుండా పోయింది. అసలు అక్కడ అసభ్యత లేదు.. ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది శరణ్య.
View this post on Instagram
శరణ్య ప్రదీప్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




