Tollywood: బూరె బుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు కుర్రాళ్ల మనసు దొచుకున్న అందాల యువరాణి.. ఎవరో గుర్తుపట్టండి..

|

Nov 11, 2022 | 11:11 AM

కెరీర్ ఆరంభంలోనే ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిన ఈ చిన్నది.. కుటుంబసభ్యుల సమక్షంలోనే ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది.

Tollywood: బూరె బుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు కుర్రాళ్ల మనసు దొచుకున్న అందాల యువరాణి.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us on

పైన ఫోటోలో ఉన్న ఈ బూరె బుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు సినీ పరిశ్రమలో కుర్రాళ్ల మనసు దొచుకున్న అందాల యువరాణి. హిట్ చిత్రాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి. ఇటీవల ఈ హీరోయిన్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతుంది. తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా చేసింది. కానీ ఆ ఫస్ట్ మూవీతోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కెరీర్ ఆరంభంలోనే ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిన ఈ చిన్నది.. కుటుంబసభ్యుల సమక్షంలోనే ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. నెమ్మదిగా స్టోరీస్ ఎంచుకుంటూ అచి తుచి అడుగులు వేస్తుంది. ఎవరో గుర్తుపట్టారా ?.

ఆ చిన్నారి హీరోయిన్ సయేషా సైగల్. 1997 ఆగస్ట్ 12న ముంబైలో జన్మించిన సయేషా.. నటనపై ఆసక్తితో మోడలింగ్ చేసింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన అఖిల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్‏ గా నిలిచింది. కానీ సయేషాకు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో ఆఫర్స్ ఎక్కువగానే వచ్చాయి. తమిళ్ స్టార్ హీరో ఆర్యను 2019లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 2021 లో అరియానా పాప జన్మించింది.

ఇవి కూడా చదవండి

శివాయ్.. వనమాగన్.. కడైకుట్టి సింహం.. జుంగా.. టెడ్డీ.. యువరత్న చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సయేషాకు వరుస ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగులోనూ పలు చిత్రాలు చేస్తున్నట్లుగా సమాచారం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.