స్టార్ హీరోయిన్ సమంత ఇప్పడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటుంది. కొన్ని నెలలుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సామ్.. ఇటీవల శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన సామ్.. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గుణశేఖర్ మాటలకు భావోద్వేగానికి గురయ్యారు. అయితే సామ్ అందం తగ్గిందని.. మునుపటిలా లేదంటూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయగా.. వారికి గట్టిగానే కౌంటరిచ్చింది సామ్. ఇక కొద్దిరోజులుగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యింది. ఇంట్రెస్టింగ్ పోస్ట్, మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా మయోసైటిస్ నుంచి కోలుకుంటూ తిరిగి వర్కవుట్స్ పై దృష్టి పెట్టింది సామ్. ఈ సమస్యను ఎదుర్కొంటూనే బలంగా ఉండేందుకు జిమ్ లో కుస్తీలు పడుతుంది. తాజాగా తన వర్కవుట్స్ వీడియో షేర్ చేస్తూ.. స్పెషల్ నోట్ రాసుకొచ్చింది.
” లావుగా ఉన్న మహిళ ఇది చేసేవరకు ముగియదు. ముఖ్యంగా @whoisgravity స్పెషల్ థాంక్స్. మీరు నాకు కొన్ని కఠినమైన రోజులలో స్పూర్తిని ఇచ్చారు. బలం అంటే మనం తీసుకునే ఆహారం ఇమ్యూనిటీ ఫుడ్ కాదు.. మనం ఎలా ఆలోచిస్తామో అదే మన బలం.” అంటూ రాసుకొస్తూ.. వర్కవుట్స్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.
డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే త్వరలోనే సామ్.. డైరెక్టర్ శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న ఖుషి చిత్రం షూటింగ్ లో పాల్గొననుంది. అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ సిటాడెల్ చిత్రీకరణలో జాయిన్ కానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.