Sai Pallavi: మీటూ ఉద్యమంపై స్పందించిన సాయి పల్లవి.. అలా కూడా వేదిస్తారంటూ..

|

Mar 10, 2023 | 8:13 AM

స్కిన్ షో కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది సాయి పల్లవి. ఇక గత ఏడాది సాయి పల్లవి విరాట పర్వం, లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Sai Pallavi: మీటూ ఉద్యమంపై స్పందించిన సాయి పల్లవి.. అలా కూడా వేదిస్తారంటూ..
Sai Pallavi
Follow us on

సాయి పల్లవి ఇక పై సినిమాలు చేయడం లేదా..? అసలు ఈ అమ్మడు ఎందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.? ఇలా అనేక ప్రశ్నలు అభిమానుల మెదడులో తిరుగుతున్నాయి. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా సాయి పల్లవి. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీఇచ్చింది. టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా ఎదిగింది సాయి పల్లవి. ఆమెకు మన దగ్గర మాములు ఫాలోయింగ్ ఉండదు. స్కిన్ షో కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది సాయి పల్లవి. ఇక గత ఏడాది సాయి పల్లవి విరాట పర్వం, లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి తన నటనతో ఆకట్టుకుంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత గార్గి అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఆమె మరో సినిమా కమిట్ అవ్వలేదు.

తాజాగా సాయి పల్లవి స్మిత హోస్ట్ గా చేస్తోన్న నిజం విత్ స్మిత అనే ప్రోగ్రామ్ కు గెస్ట్ గా హాజరయ్యింది. అయితే ఈ కార్యక్రమంలో సాయి పల్లవి మీటూ ఉద్యమం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చేతలతోనే కాదు.. మాటలతో ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించేలా చేసినా అది వేధింపులతోనే సమానం అంటూ చెప్పుకొచ్చింది.

అయితే ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాయి పల్లవి కేవలం మీటూపైన కాకుండా..   తన కెరియర్ గురించి కూడా చాలా విషయాలు పంచుకుంది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.