AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: సైలెంట్ అయిన తగ్గేదే లే.. సాయి పల్లవి క్రేజ్ ఇదే మరీ.. న్యాచురల్ బ్యూటీ నటనకు పాన్ ఇండియా ఫిదా..

అయితే కొద్ది రోజులుగా సాయి పల్లవి నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. అటు సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్ అయ్యింది ఈ న్యాచురల్ బ్యూటీ. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై సాయిపల్లవి స్పందించలేదు.

Sai Pallavi: సైలెంట్ అయిన తగ్గేదే లే.. సాయి పల్లవి క్రేజ్ ఇదే మరీ.. న్యాచురల్ బ్యూటీ నటనకు పాన్ ఇండియా ఫిదా..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2023 | 9:12 AM

Share

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దొచేసింది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు ఆమె ముందు క్యూ కట్టిన హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఒకే చేసింది. అలా సాయి పల్లవి నటించింది అతి తక్కువ సినిమాలే అయినా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె నటనకు తెలుగు టాప్ మోస్ట్ డైరెక్టర్స్ సైతం ఫిదా అయ్యారు. ఇటీవల ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాల్లో సాయి పల్లవి నటన వేరేలెవల్. ఈ చిత్రాలకు ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సైతం అందుకుంది. అయితే కొద్ది రోజులుగా సాయి పల్లవి నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. అటు సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్ అయ్యింది ఈ న్యాచురల్ బ్యూటీ. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై సాయిపల్లవి స్పందించలేదు.

చాలా కాలంగా నెట్టింట సైలెంట్ అయిన సాయి పల్లవి తాజాగా ముంబైలో సందడి చేసింది. ఆమె నటించిన రీసెంట్ హార్ట్ హిట్టింగ్ సినిమా గార్గి గతేడాది విడుదల మంచి హిట్ అందుకుంది. ఇందులో ఆమె నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమాకు గానూ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ అందుకుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి నటనకు గానూ.. ఉత్తమ నటిగా ఈ అవార్డ్ కైవసం చేసుకుంది. తాజాగా ఈ అవార్డ్ ప్రధానోత్సవాల కోసం ముంబై వెళ్లింది. అందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ అవార్డ్ వేడుకల కోసం సాయి పల్లవి రెడ్ సారీలో అక్కడకు హాజరైంది. చాలా కాలం తర్వాత న్యాచురల్ బ్యూటీ బయట కనిపించడంతో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఫ్యాన్స్ కు నమస్కారం తెలుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు సాయి పల్లవి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చమురు ధరల పతనం.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గనున్నాయా..?
చమురు ధరల పతనం.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గనున్నాయా..?
గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
Weekly Horoscope: వారి ఆదాయం పెరగడమే తప్ప తగ్గదు..
Weekly Horoscope: వారి ఆదాయం పెరగడమే తప్ప తగ్గదు..
టీ20 ప్రపచంకప్ మ్యాచ్ ఫిక్సింగ్ వెనుక పంజాబ్ గ్యాంగ్‌స్టర్ హస్తం
టీ20 ప్రపచంకప్ మ్యాచ్ ఫిక్సింగ్ వెనుక పంజాబ్ గ్యాంగ్‌స్టర్ హస్తం
ఈగ సినిమాలో నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు..
ఈగ సినిమాలో నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు..
పూజ చేస్తుండగా చిన్న ఏమరపాటు.. క్షణాల్లో నిండు ప్రాణం బలి!
పూజ చేస్తుండగా చిన్న ఏమరపాటు.. క్షణాల్లో నిండు ప్రాణం బలి!
వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర అంచనాలు
వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర అంచనాలు
మల్లె మొక్క పెరగడం లేదా..? ఇలా చేస్తే గుత్తులు గుత్తులు పూస్తాయ్
మల్లె మొక్క పెరగడం లేదా..? ఇలా చేస్తే గుత్తులు గుత్తులు పూస్తాయ్
హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీని.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి
హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీని.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి
ఈ కడియం ధరిస్తే ఈ రాశుల వారికి అదృష్టం జిడ్డులా పడుతుంది..
ఈ కడియం ధరిస్తే ఈ రాశుల వారికి అదృష్టం జిడ్డులా పడుతుంది..