Sai Pallavi: ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ళ మనసులో చెరగని ముద్ర వేసింది అందాల భామ సాయి పల్లవి. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉంది. సహజంగానే డ్యాన్సర్ అయిన సాయి పల్లవి టాలెంట్ బాలీవుడ్ ను సైతం ఆకర్షించింది. అక్కడి నుంచి చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయట. సాయి పల్లవి సినిమాల్లో వేసే స్టెప్పులకు ఫ్యాన్స్ అవుతున్నారు.
ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో బిజీగా ఉన్న సాయి పల్లవికి ఇప్పుడు బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫార్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ బ్యానర్ కూడా ఈ బ్యూటీని సంప్రదించిట్లు టాక్. బాలీవుడ్ కు వెళ్లడానికి ఈ అమ్మడు కూడా సిద్ధంగానే ఉందని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ లో సాయిపల్లవి నటించిన రెండు చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కానున్నాయి. అందులో నాగచైతన్యతో కలిసి నటించిన ‘లవ్ స్టోరీ’ ఒకటికాగా.. రానాతో నటించిన విరాటపర్వం. అలాగే నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ.
మరిన్ని ఇక్కడ చదవండి :