Sai Pallavi : స్టేజ్ ఏదైనా క్రేజ్ మాత్రం ఈ అమ్మడిదే.. రౌడీ బేబీ రోజు రోజుకు పెరుగుతున్న ఫాలోయింగ్..

మనతోని ముచ్చట గట్లనే ఉంటది మల్లా అని అంటున్నారు సాయిపల్లవి. ఎక్కిన స్టేజ్‌ సొంతమైనా, పక్కోళ్లదయినా పొగడ్తలు మాత్రం నావే అన్నట్టుంది పల్లవి పరిస్థితి.

Sai Pallavi : స్టేజ్ ఏదైనా క్రేజ్ మాత్రం ఈ అమ్మడిదే.. రౌడీ బేబీ రోజు రోజుకు పెరుగుతున్న ఫాలోయింగ్..
Sai Pallavi

Updated on: Mar 03, 2022 | 8:25 PM

Sai Pallavi : మనతోని ముచ్చట గట్లనే ఉంటది మల్లా అని అంటున్నారు సాయిపల్లవి. ఎక్కిన స్టేజ్‌ సొంతమైనా, పక్కోళ్లదయినా పొగడ్తలు మాత్రం నావే అన్నట్టుంది పల్లవి పరిస్థితి. తెలుగు ఇండస్ట్రీ మెగాస్టార్‌ చిరు నుంచి… నేషనల్‌ క్రష్‌ రష్మిక వరకు.. అందరి నోటా ఒకటే మాట.. రౌడీ బేబీ సాయిపల్లవి గురించి తెలియనిది ఎవరికి చెప్పండి? పక్కా తెలంగాణ శ్లాంగ్‌తో, పర్ఫెక్ట్ కేరక్టర్స్ సెలక్షన్‌తో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా ఎస్టాబ్లిష్‌ అయ్యారు సాయిపల్లవి. రీసెంట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరు అయ్యారు. గోల్డ్ కలర్‌ డ్రస్‌తో… ఈవెంట్‌ సరౌండింగ్స్ జిగేల్‌మనిపించేలా ప్రెజెంట్‌ అయిన పల్లవికి అంతకు మించిన పాజిటివ్‌ వైబ్స్ అందాయి.

స్టేజ్‌ మీద రష్మిక మందన్న మాట్లాడుతూ సాయిపల్లవిని ఉద్దేశించి షి ఈజ్‌ సో క్యూట్‌ కదా అనేశారు. డైరక్టర్‌ సుకుమార్‌ అయితే మరో అడుగు ముందుకేసి నువ్వు ఫీమేల్‌ పవన్‌ కల్యాణ్‌వా? అంటూ ఒక్కసారిగా ఆడిటోరియంలో సౌండ్‌ పెంచేశారు. సాయిపల్లవికి ఇలా స్టేజ్‌ మీద కాంప్లిమెంట్లు అందుకోవడం కొత్తేం కాదు. గతంలో లవ్‌స్టోరీ ఫంక్షన్‌కి గెస్ట్ గా వచ్చిన చిరంజీవి కూడా పల్లవితో స్టెప్పులేయాలని ఉందన్న విషయాన్ని సరదాగా కన్వే చేశారు. ఒకప్పుడు అనుష్క విషయంలో జరిగిన సీన్‌… ఇప్పుడు సాయిపల్లవి విషయంలో రిపీట్‌ అవుతోందన్నమాట! ప్రస్తుతం సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమాలో పల్లెటూరి యువతి గా కనిపించనుంది ఈ ఫిదా భామ. ఈ సినిమా తప్ప ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ఏంటనేది ప్రకట్టించలేదు ఈ చిన్నది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiran Abbavaram: టికెట్టు కొని సినిమా చూసే నన్ను హీరోను చేశాడు.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్..

Bigg Boss OTT: ప్రేక్షకులకు షాక్.. ఆగిపోయిన బిగ్‏బాస్ నాన్‏స్టాప్.. కారణం చెప్పిన నిర్వాహకులు..

Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..