Sadha: విడాకులు తీసుకోవడంలో తప్పులేదు.. హీరోయిన్ సదా అలా అనేసిందేంటీ..!

జయం సినిమా తర్వాత సదా వరుసగా ఆఫర్స్ అందుకుంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. తక్కువ సమయంలోనే సదా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది.

Sadha: విడాకులు తీసుకోవడంలో తప్పులేదు.. హీరోయిన్ సదా అలా అనేసిందేంటీ..!
Heroine Sadha
Follow us

|

Updated on: Jun 17, 2024 | 5:12 PM

జయం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అందాల భామ సదా. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియెట్ చేసింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. అలాగే గోపీచంద్ విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది సదా. జయం సినిమా తర్వాత సదా వరుసగా ఆఫర్స్ అందుకుంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. తక్కువ సమయంలోనే సదా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది.

తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ అమ్మడు. తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాలో నటించి భారీ హిట్ అందుకుంది. అపరిచితుడు సినిమాలో తన నటనతో అక్కడి ప్రేక్షకులకు దగ్గరయింది. ప్రస్తుతం సదా సినిమాలు తగ్గించింది. పలు టీవీ షోల్లో పాల్గొంటుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఈ అమ్మడి వయసు పెరుగుతున్నా తరగని అందంతో కవ్విస్తుంది. అయితే సదా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. తాజాగా సదా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

విడాకులు తీసుకోవడంలో తప్పులేదు అంటుంది సదా. “ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను, నాకు నచ్చిన పని చేసుకుంటున్నాను. ఈ ఫ్రీడమ్ ను నేను పోగొట్టుకోవాలనుకోవడంలేదు. ఇప్పటివరకు తనకు నచ్చిన వ్యక్తి దొరకలేదు అని.. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ కలగలేదు అని చెప్పుకొచ్చింది సదా. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ కాన్సెప్ట్ కి వ్యతిరేకమని తెలిపింది. అస్సలు పరిచయం లేని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటారు.? ఎలా కలిసి ఉంటారో నాకు అర్ధం కావడం లేదు అని తెలిపింది. పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటానని తెలిపింది. తన పేరెంట్స్ ది కూడా లవ్ మ్యారేజ్ అని తెలిపింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్‌ సాగడం కష్టంగా ఉందని భావిస్తే.. పార్టనర్‌తో జర్నీ చాలా కష్టంగా అనిపిస్తే.. భరించలేకపోతే విడాకులు తీసుకోవడంలోనూ తప్పులేదు అంటుంది సదా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Sadaa (@sadaa17)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!