Renu Desai: రేణు దేశాయ్‌కు సారె పెట్టి ఘనంగా సత్కరించిన మంత్రి కొండా సురేఖ.. వీడియో వైరల్.. కారణమిదే

|

Jul 26, 2024 | 8:41 PM

ప్రముఖ నటి రేణు దేశాయ్ శుక్రవారం (జులై 26) అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని సురేఖ ఇంటికి వెళ్లిన ఆమె మంత్రితో ర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల విషయాలపై కులంకుషంగా చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరిస్తోన్న రేణు దేశాయ్..

Renu Desai: రేణు దేశాయ్‌కు సారె పెట్టి ఘనంగా సత్కరించిన మంత్రి కొండా సురేఖ.. వీడియో వైరల్.. కారణమిదే
Renu Desai, Konda Surekha
Follow us on

ప్రముఖ నటి రేణు దేశాయ్ శుక్రవారం (జులై 26) అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని సురేఖ ఇంటికి వెళ్లిన ఆమె మంత్రితో ర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల విషయాలపై కులంకుషంగా చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరిస్తోన్న రేణు దేశాయ్ ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రి సురేఖకి వివరించారు. ఇక తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణు దేశాయ్ కు ఘనంగా స్వాగతం పలికారు మంత్రి సురేఖ. నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమ అందజేసి సత్కరించారు. ఇదే సందర్భంగా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణు దేశాయ్ కి తన చేతులతో అలంకరించారు మంత్రి సురేఖ. కొండా కుటుంబ సభ్యులు తన పట్ల చూపిన ప్రేమాభిమానాల పట్ల రేణు దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు.

నటిగానే కాకుండా పర్యావరణ ప్రేమికురాలిగా, యానిమల్ లవర్ గా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు రేణు దేశాయ్. వీటికి సంబంధించి పలువురి దాతల దగ్గర విరాళాలు సేకరించారు.

ఇవి కూడా చదవండి

మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో రేణు దేశాయ్..

ఇటీవల తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలను డీయాక్టివేట్ చేశారు రేణు దేశాయ్. నెట్టింట వస్తోన్న నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్ కు దూరంగా ఉండేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాను చేపడుతోన్న సామాజిక సేవా కార్యక్రమాల కోసమే ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను కొనసాగిస్తున్నారు రేణు దేశాయ్.

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.