Renu Desai: ఇలాంటి ఇడియట్స్‌కు దూరంగా ఉండాలి.. రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

టాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్ కు సామాజిక స్పృహ ఎక్కువ. అందుకే మహిళలు, చిన్నారులకు ఉపయోగపడేలా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే మూగ జీవాల సంరక్షణ కోసం పాటు పడుతోంది. ఇక సామాజిక సమస్యలపై తన దైన శైలిలో స్పందిస్తుంటోందీ అందాల తార.

Renu Desai: ఇలాంటి ఇడియట్స్‌కు దూరంగా ఉండాలి.. రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
Renu Desai

Updated on: Feb 11, 2025 | 7:47 PM

టాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో నటించకపోయినా తన సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు అందుకుంటోందీ అందాల తార. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల కోసం తన వంతు మంచి పనులు చేస్తోంది. అలాగే మూగ జీవాల సంరక్షణ కోసం కృషి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే రేణూ దేశాయ్ సమాజంలో జరుగుతోన్న కొన్ని ఆటవిక సంఘటనలపై తన గళాన్ని వినిపిస్తుంటుంది. వివరాల్లోకి వెళితే.. రణ్ వీర్ అలహాబాదియా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ పేరు మార్మోగిపోతోంది. సమయ్ రైనా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో అభ్యంతరకరమైన, వివాదాస్పద కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డాడు రణ్ వీర్. దీంతో అతను ప్రతి చోటా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. సినీ ప్రముఖులు కూడా రణ్ వీర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. తాజాగా రేణూ దేశాయ్ రణ్ వీర్ అసభ్యకరమైన కామెంట్స్ పై స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.

బాధ్యతగా ఉండాలి..

‘‘మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, మంచిగా, బాధ్యతగా పెంచాలి అనుకుంటే రణ్‌వీర్ లాంటి ఇడియట్స్‌ను దూరం పెట్టండి. వారిని అన్‌ఫాలో చేయాలి. యంగ్ జనరేషన్ అంతా కూడా ఎంతో బాధ్యతగా ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే కేటగిరీ కింద వల్గారిటీ అనేది ఈ యూత్ యాక్సెప్ట్ చేస్తుంది’ అని రేణూ దేశాయ్ రాసుకొచ్చింది.’

ఇవి కూడా చదవండి

 

కాగా రణ్ వీర్ అలహా బాదియా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం అతను తన స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. రణ్ వీర్ తో పాటు ఈ షోలో పాల్గొన్న న అపూర్వ , సమీర్ లను అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.