అమ్మబాబోయ్.. రష్మికాకు ఇంత చిన్న చెల్లి ఉందా..! ఇద్దరిమధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు పాన్ ఇండియా ఇండస్ట్రీని ఏలేస్తుంది. తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతుంది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. రీసెంట్ గా పుష్ప సినిమాతో, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే రష్మిక మందన్న పర్సనల్ విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా తన చెల్లెలి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మికకు 10 ఏళ్ల వయసున్న ఒక చెల్లెలు ఉంది. ఆ చిన్నారి పేరు షిమాన్ మందన్న. గత ఏడాది మే 2న తన చిన్నారి చెల్లి బర్త్ డే సందర్భంగా తన ఇన్ స్టా స్టోరీలో ఫోటో షేర్ చేస్తూ చెల్లికి విషెస్ తెలిపింది రష్మిక. అలాగే తన బర్త్ డే సెలబ్రెషన్స్ మిస్ అవుతున్నానంటూ రాసుకోచ్చింది. ఆ పోస్టు చూసి అభిమానులు షాక్ అయ్యారు. రష్మికకు ఆమె చెల్లికి దాదాపు 16 సంవత్సరాల గ్యాప్ ఉంది. ప్రస్తుతం రష్మిక వయసు 28 సంవత్సరాలు. ఇక తన చిన్నారి చెల్లి వయసు 10 ఏళ్లు. తన చిన్నారి చెల్లెలు ఎదుగుదలను తాను మిస్ అవుతున్నానని.. అలాగే తనతో సరదాగా గడిపే సమయాన్ని మిస్ అవుతున్నానని గతంలో తెలిపింది రష్మిక.
అలాగే తన చెల్లి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి చాలాకాలం పాటు దగ్గరుండి చూసుకున్నానని.. స్నానం చేయించడం నుంచి డైపర్స్ మార్చడం వరకు అన్ని పనులు చేసేదాన్ని అని అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి గురించి చెప్పుకొచ్చింది. ఇప్పుడు రష్మిక చెప్పి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా తన చెల్లి ఎదుగుదలను చూడలేకపోతున్నానని.. తనతో ఎక్కువగా సమయం గడపలేకపోతున్నానని తెలిపింది. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఛావా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ డ్రామాలుగా వస్తున్నాయి. అలాగే సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాలోనూ నటిస్తుంది. ధనుష్ , నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న కుబేర సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక తన చెల్లితో కలిసున్న ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
(நடிகை ராஷ்மிகா மந்தனா தங்கையா இவங்க? நடிகை சொன்ன தகவல்!)
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




