Vijay Deverakonda: అబుదాబికు విజయ్ దేవరకొండ ప్రయాణం.. రష్మికా కోసమేనా.?

|

Apr 04, 2024 | 9:34 AM

విజయ్, రష్మిక. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. రష్మిక మందన్న ఏప్రిల్ 5న తన పుట్టినరోజును జరుపుంటుంది. అదే రోజు విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' కూడా విడుదలవుతోంది. ఇప్పుడు రష్మిక పుట్టినరోజు గురించి ఓ కొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Vijay Deverakonda: అబుదాబికు విజయ్ దేవరకొండ ప్రయాణం.. రష్మికా కోసమేనా.?
Vijay Deverakonda
Follow us on

విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న మధ్య ఏదో జరుగుతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి.. కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే దీని పై ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. విజయ్, రష్మిక. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. రష్మిక మందన్న ఏప్రిల్ 5న తన పుట్టినరోజును జరుపుంటుంది. అదే రోజు విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ కూడా విడుదలవుతోంది. ఇప్పుడు రష్మిక పుట్టినరోజు గురించి ఓ కొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రష్మిక మందన్న ప్రస్తుతం అబుదాబిలో ఉంది. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియోకు ‘నా పుట్టినరోజు వారం’ అని క్యాప్షన్ ఇచ్చింది. రష్మిక ప్రస్తుతం అబుదాబిలోని సర్ బనియాస్ ఐస్‌ల్యాండ్‌లో ఉంది. విజయ్ దేవరకొండ కూడా ఇక్కడికి వెళ్లబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.. విజయ్ దేవరకొండ ఈరోజు (ఏప్రిల్ 4) అబుదాబి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ రష్మికతో కలిసి ఆమె పుట్టిన రోజును జరపనున్నాడని అంటున్నారు. బెస్ట్ ఫ్రెండ్ కోసం విజయ్ అబుదాబి వెళ్తున్నాడన్న వార్తలపై  ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం కూడా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సినిమా హిట్ అయితే విజయ్ దేవరకొండ కూడా అక్కడే సెలబ్రేషన్స్ జరుపుకుంటాడని అంటున్నారు.

‘గీత గోవిందం’ సినిమాలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్, రష్మిక జంటగా ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కాగా విజయ్ రష్మిక కలిసి మాల్దీవులకు వెళ్లారని గతంలో వార్తలు వచ్చాయి. ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్నసినిమా ‘విజయ్ దేవరకొండ 12’. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అటు రష్మిక మందన్న ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉంది. రేపు ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. రష్మిక లుక్ రివీల్ చేస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.