కొంత మంది హీరోయిన్లను చూస్తుంటే వీళ్లకు వయసు తగ్గుతుందా అన్న అనుమానాలు కలుగుతాయి.. తరగని అందంతో ఇప్పటికి తమ గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నారు కొందరు తారలు. నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తూ సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఈ లిస్ట్‌లో ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. మీనా, రమ్య కృష్ణ, కుష్బూవంటి తారలు ఇప్పటికి తమ అందంతో మతిపోగొడుతున్నారు. ఇక ఈ బ్యూటీ కూడా అప్పటికి ఇప్పటికి ఎలాంటి అందంలో ఎలాంటి మార్పు లేకుండా ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు యువతను ఉర్రుతలు ఊగించిన హీరోయిన్స్‌లో రంభ ఒకరు. రంభ అందానికి ఆమె క్యూట్‌నెస్‌కు అప్పటి కుర్రకారు ఫిదా అయిపోయారు. రంభ ఇప్పటికి అదే గ్లామర్‌ను మెయింటేన్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
తాజాగా ఆమె దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత కొంత కాలంగా వైవాహిక జీవితాన్ని ఆస్వాధిస్తున్న రంభ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలని షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రంభ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరనస నటించి అలరించింది రంభ. కేవలం తెలుగులోనే కాదు తమిళ- కన్నడ- మలయాళ- హిందీ- బెంగాలీ- భోజ్ పురీ- ఇంగ్లీష్ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది రంభ. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ ఇలా సోషల్ మీడియాలో అభిమానులను అప్పుడప్పుడు పలకరిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు సీనియర్ బ్యూటీలు ఒక్కొక్కరు రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో రంభ కూడా త్వరలో తిరిగి కెమెరా ముందుకు వస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :