రాజస్థాన్ వైద్యురాలు ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రసవ సమయంలో ఓ మహిళ మరణానికి కారణమయ్యిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. డాక్టర్ ఆత్మహత్యపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ ప్రణీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. “నిర్దోషి అని నిరూపించుకోవడానికి వైద్యురాలు తన జీవితాన్ని ముగించాల్సి రావడం బాధాకరం” అంటూ ట్వీట్ చేసింది ప్రణీత (Pranitha).
అసలు విషయానికి వస్తే… రాజస్థాన్లో దౌసా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ అర్చన శర్మ గైనాలజిస్ట్ గా పనిచేస్తోంది. అయితే అదే ఆసుపత్రిలో ఓ గర్భిణీకి వైద్యం చేస్తుండగా..ఆమె మరణించింది. దీంతో సదరు గర్భిణీ కుటుంబసభ్యులు డాక్టర్ అర్చనపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. మహిళ హత్యకు డాక్టర్ అర్చన కారణమంటూ ఆమెను నిందిస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో అవమానంగా భావించిన డాక్టర్ అర్చన అమాయక వైద్యులను వేధించవద్దు.. నేను ఏ తప్పు చేయలేదు.. ఎవరి చావుకు కారణం కాదు. నా చావుతోనైనా నేను తప్పుచేయలేదని గుర్తించండి అంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. దీంతో సదరు వైద్యురాలికి మద్దతుగా సోషల్ మీడియాలో #JusticeForDrArchanaSharma అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రణీత వైద్యురాలుకు మద్దతుగా ట్వీట్ చేసింది.
ట్వీట్.
Sad that a doctor had to end her life to prove her innocence.. #JusticeForDrArchanaSharma #DrArchanaSharma pic.twitter.com/cTSRQNTsPC
— Pranitha Subhash (@pranitasubhash) March 30, 2022
Also Read: Darja Teaser: దర్జా టీజర్ రిలీజ్.. చీరకట్టిన సివంగిగా మరోసారి అదరగొట్టిన అనసూయ..
Nagarjuna: శరవేగంగా ది ఘోస్ట్.. దుబాయ్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన నాగార్జున అండ్ టీం..
Swimming Benefits: స్విమ్మింగ్ చేస్తే బరువు తగ్గుతారా ?.. ఈ టిప్స్ ఫాలో అయితే ఖాయమంటున్న నిపుణులు..