Pragathi: రెండో పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి ప్రగతి.. ఏమన్నారంటే

|

Jan 03, 2023 | 3:32 PM

అంతే కాదు కామెడీతోనూ ఆమె నవ్వులు పూయిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో నటించి నవ్వులు పూయించారు ప్రగతి. ఇక ప్రగతి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే..

Pragathi: రెండో పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి ప్రగతి.. ఏమన్నారంటే
Pragathi
Follow us on

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వీరిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ప్రగతి. హీరోలకు అమ్మగా, అత్తగా, వదినగా, పిన్నిగా పలు రకాల క్యారెక్టర్స్ లో అలరించారు ప్రగతి. తనదైన సహజ నటనతో సినిమాల్లో రాణిస్తున్నారు. అంతే కాదు కామెడీతోనూ ఆమె నవ్వులు పూయిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో నటించి నవ్వులు పూయించారు ప్రగతి. ఇక ప్రగతి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.. నాలుగు పదుల వయసులోనూ అందంగా కనబడటమే కాకుండా ఫిట్నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ చేసే వర్కౌట్ వీడియోస్ తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే పాటలు డ్యాన్స్ చేస్తూ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు ప్రగతి. ఇదిలా ఉంటే తాజాగా ప్రగతికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇక ప్రగతి వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే.. ఆమె తన భర్తతో విడాకులు తీసుకొని విడిగా జీవిస్తున్నారు. అయితే గతంలో చాలా  సందర్భాల్లో ప్రగతి రెండో పెళ్లి పై వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె రెండో పెళ్లి గురించి మరోసారి ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రగతికి కొడుకు కూతురు ఉన్న విషయం తెలిసిందే.. భర్త సాయం లేకుండా కూతురు కొడుకును పెంచి పెద్ద చేసింది ప్రగతి. తాజాగా ఆమె రెండో పెళ్లి విషయం పై స్పందిస్తూ..పెళ్లి అని కాదు కానీ కంపానియన్ ఉంటే బాగుండేది అని చాలాసార్లు అనుకున్నా.. అయినా నా మెచూరిటీ లెవల్ కు తగ్గవాడు దొరకడం కష్టమే.. కానీ.. రావాలని ఉంటే మాత్రం అదే జరుగుతుంది అని నేను నమ్ముతాను. నాకంటూ కొన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. నేను 20 ఏళ్ల వయసులో ఉండిఉంటే అడ్జెస్ట్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు కష్టం.. అని చెప్పుకొచ్చింది ప్రగతి.

ఇవి కూడా చదవండి