టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. ఇటీవలే పాన్ ఇండియా ఫిల్మ్ రాధేశ్యామ్, బీస్ట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ రెండు చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పూజా స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు.. అలాగే.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న జనగణమన సినిమాలోనూ నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ చిన్నది. ఇప్పుడు తన మాతృభాష అయిన కన్నడంలోనూ నటించనున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి మంగళూరుకు చెందిన పూజా హెగ్డే.. తెలుగు, తమిళంలో అగ్రకథానాయికగా కొనసాగుతున్నప్పటికీ కన్నడంలో మాత్రం ఒక్క సినిమా చేయలేదు..
తాజా సమాచారం ప్రకారం ఇప్పడు కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందట.. మఫ్టీ సినిమా త్వాత శాండల్ వుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు నర్తన్.. ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారు.. అయితే ఇప్పుడు నర్తన్.. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాలో కథానాయికగా ఎంచుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.. త్వరలోనే ఈ మూవీపై పూర్తి వివరాలను ప్రకటించనున్నారని సమాచారం..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..