
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఆమె ఫ్యాన్స్ అండాల్నా వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఇంతకు ముందు ఉన్నత హుషారుగా ఎక్కడ కనిపించడం లేదు దాంతో మరింత బెంగ పెట్టుకున్నారు. సమంత మయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది .కొద్దిరోజుల క్రిత్రం తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదొక ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ త్వరగానే కోలుకుంటాను అను సమంత రాసుకొచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే చాలా మంది సెలబ్రెటీలు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు షేర్ చేశారు. సామ్ కు వచ్చిన వ్యాధి పేరు మయోసైటిస్. ఈ వ్యాధి సోకినా వారికి కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం, నడవలేకపోవడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం సమంత ఇదే సమస్యతో బాధపడుతోంది.
ఇక ఇదే సమస్య తో తానూ కూడా బాధపడుతున్న అని నటి పూనమ్ కౌర్ కూడా తెలిపింది. అలాగే మరో నటి కల్పిక గణేష్ కూడా తనకు మయో సైటిస్ వ్యాధి ఉందని తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నటి ముందుకు వచ్చి తాను కూడా అదే వ్యాధితో బాధపడుతున్నా అని తెలిపి షాక్ ఇచ్చింది. ఇంతకు ఆమె ఎవరో కాదు.
తమిళ్ హీరో జీవా నటించిన రంగం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఫియాబాజ్ పై. తాను కూడా మయో సైటిస్ వ్యాధితో బాధపడుతున్నా అని తెలిపింది. మయోసైటిస్ వ్యాధి ఉందని తెలిసిన వెంటనే తాను ఇంట్లో వారికి కూడా ఈ విషయం చెప్పలేదని, ఇంట్లో వారికి తెలియకుండా ముంబైలో ఉండి ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నానని తెలిపింది. తన వ్యాధి గురించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.