AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pavitra Lokesh: ఆమె కావాలని ఇదంతా చేస్తోంది.. పవిత్ర లోకేష్‌ ట్రోలింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్

మార్ఫింగ్‌ ఫొటోలు, వల్గర్‌ కామెంట్స్‌తో ఓ ఆటాడుకుంటున్నారు. రోజురోజుకీ ట్రోల్స్‌ టార్చర్‌ పెరిగిపోవడంతో సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది పవిత్రా లోకేష్‌.

Pavitra Lokesh: ఆమె కావాలని ఇదంతా చేస్తోంది.. పవిత్ర లోకేష్‌ ట్రోలింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్
Pavitra Lokesh
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2022 | 11:38 AM

Share

సీనియర్‌ నరేష్‌-పవిత్ర లోకేష్‌పై ట్రోల్స్‌ రంకెలేస్తున్నాయ్‌. వీళ్లిద్దరిపై సోషల్‌ మీడియాలో ఒక రేంజ్‌లో ఎటాక్‌ జరుగుతోంది. మార్ఫింగ్‌ ఫొటోలు, వల్గర్‌ కామెంట్స్‌తో ఓ ఆటాడుకుంటున్నారు. రోజురోజుకీ ట్రోల్స్‌ టార్చర్‌ పెరిగిపోవడంతో సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు పవిత్రా లోకేష్‌. తమపై అసభ్య ప్రచారం చేస్తోన్నవాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని వెబ్‌సైబ్స్‌, యూట్యూబ్‌ ఛానెల్స్‌ ఉద్దేశపూర్వకంగా అసభ్య కథనాలు ఇస్తున్నాయంటూ ఆధారాలు సబ్‌మిట్‌ చేశారామె. తమపై జరుగుతోన్న ట్రోలింగ్‌ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. పవిత్ర కంప్లైంట్‌తో 15 యూట్యూబ్‌ ఛానెళ్లకు నోటీసులిచ్చారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. మూడ్రోజుల్లోగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. నోటీసులందుకున్న యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వాహకులు ఇవాళ పోలీసుల ముందు అటెండ్‌కానున్నారు.

ఇదిలా ఉంటే నరేష్‌ భార్య రమ్యరఘుపతిపై ఫిర్యాదు చేశారు పవిత్ర. రమ్మ, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలున్నాయి. నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు అడ్డంపెట్టుకొని నన్ను కించపరుస్తున్నారు అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు పవిత్ర.

పవిత్రా లోకేష్‌ అందించిన ఇన్ఫర్మేషన్‌ ఆధారంగా ఇంటరాగేట్‌ చేయనంది సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌. మెయిన్‌గా ఫొటోల మార్ఫింగ్‌, అసభ్య రాతలపై ప్రశ్నించనున్నారు. ఎందుకు ఉద్దేశపూర్వకంగా కథనాలు రాస్తున్నారు?. దీని వెనక ఎవరైనా ఉన్నారా?. ఇలా అనేక కోణాల్లో విచారించనున్నారు సైబర్ క్రైమ్‌ పోలీసులు. అయితే, ఈసారికి హెచ్చరించి వదిలేస్తారా? లేక యాక్షన్‌ తీసుకుంటారా? అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..