
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన విజయం తర్వాత దేవర సినిమాతో హిట్ కొట్టాడు తారక్. ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. మాములుగా రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరో చేసే సినిమాలు ఫ్లాప్ అవుతాయని టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. దాన్ని తారక్ బ్రేక్ చేశాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
కాగా దేవర సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ లో తారక్ డాన్స్ తో అదరగొట్టారు. అలాగే జాన్వీ తన అందంతో కవ్వించింది. ఇక ఈ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందంటే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఈ సాంగ్ కు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా సాంగ్ మధ్యలో అ.. అంటూ వచ్చే సౌండ్ కు బాగా కనెక్ట్ అయ్యారు.
తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార పిల్లలు దేవర సాంగ్ ను హమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నయన్ పిల్లలు కూడా దేవర సాంగ్ లో వచ్చే అ.. సౌండ్ కు కనెక్ట్ అయ్యారు. కారులో వెళ్తున్న సమయంలో సాంగ్ ప్లే అవుతుండగా సాంగ్ మా మధ్యలో నయన్ కొడుకు అ అని అనడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై తారక్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.