Megha Akash: పెళ్లికి వేళాయె! కాబోయే భర్తతో కలిసి మెహెందీ వేడుకల్లో మేఘా ఆకాష్.. ఫొటోస్ వైరల్

ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, పెద్దలు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా పూలదండలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారీ ప్రేమ పక్షులు. అవును.. మేఘా ఆకాష్- విష్ణు పెళ్లికి రెడీ అయిపోయారు

Megha Akash: పెళ్లికి వేళాయె! కాబోయే భర్తతో కలిసి మెహెందీ వేడుకల్లో మేఘా ఆకాష్.. ఫొటోస్ వైరల్
Megha Akash

Updated on: Sep 14, 2024 | 2:50 PM

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. బ్యాచిలర్ లైఫ్‌కు బై బై చెప్పేసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. తన ప్రియుడు సాయి విష్ణుతో కలిసి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైందీ అందాల తార. ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, పెద్దలు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా పూలదండలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారీ ప్రేమ పక్షులు. అవును.. మేఘా ఆకాష్- విష్ణు పెళ్లికి రెడీ అయిపోయారు. ప్రస్తుతం వీరి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. మేఘ ఆకాష్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది, ఎక్కడ చేసుకుంటుంది అనే వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ శుక్రవారం (సెప్టెంబర్ 13) మెహెందీ కార్యక్రమం మాత్రం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందీ ముద్దుగుమ్మ. ‘మెహెందీ డే’ అంటూ వీటికి క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు ముందుస్తుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం ఈ హడావిడి చూస్తుంటే మరో రెండు రోజుల్లోనే మేఘ ఆకాష్- విష్ణుల వివాహం జరగనుందని తెలుస్తోంది. కాగా వీరిది ప్రేమ వివాహం. గత కొన్నేళ్లుగా మేఘ, విష్ణులు లవ్ లో ఉన్నారని సమాచారం. అయితే గోప్యత పాటించారు. పెద్దల అనుమతితో గత నెలలో సడెన్‌గా నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయట పెట్టారు.

ఇవి కూడా చదవండి

మెహెందీ వేడుకల్లో మేఘా ఆకాష్, విష్ణు..

ఎంగేజ్మెంట్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తదితర సినీ ప్రముఖులకు తన వెడ్డింగ్ కార్డ్స్ ను అందజేసింది మేఘా ఆకాష్. ఇటీవలే శ్రీలంకలో తన స్నేహితులతో కలిసి గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ కూడా చేసుకుంది. వీటికి సంబంధించిన ఫొటోలన్నీఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి.

మేఘా, విష్ణుల ఎంగేజ్ మెంట్ ఫొటోలు..

శ్రీలంకలో మేఘా బ్యాచిలరేట్ పార్టీ…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి