62 ఏళ్ల వయసులోనే అదే ఎనర్జీ.. తన క్లాసికల్ సాంగ్‌కు మళ్లీ స్టెప్పులేసిన అలనాటి హీరోయిన్.. వీడియో ఇదిగో

గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఓ డ్యాన్స్ స్కూల్ ను రన్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన డాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి తన సూపర్ హిట్ సాంగ్ కు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.

62 ఏళ్ల వయసులోనే అదే ఎనర్జీ.. తన క్లాసికల్ సాంగ్‌కు మళ్లీ స్టెప్పులేసిన అలనాటి హీరోయిన్.. వీడియో ఇదిగో
Tollywood Actress

Updated on: Apr 16, 2026 | 5:20 PM

గతంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారందరూ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ అంటూ సహాయక నటి పాత్రలు పోషిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు ముద్దుగుమ్మలు రకరకాల బిజినెస్ లు చూసుకుంటూ బిజీ బిజీగా ఉంటున్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు.. గతంలో పలు తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించారీ అందాల తార. ది గ్రేట్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తదితర స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. అయితే చాలా మంది హీరోయిన్లలాగే పెళ్లయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయారు. ఎక్కడో అమెరికాలో పిల్లలకు డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే ఈ అందాల తార తాజాగా ఒక వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతలో షేర్ చేశారు. అందులో తన స్కూల్ డ్యాన్స్ పిల్లలతో కలిసి ఓ తెలుగు పాటను రీక్రియేట్ చేశారీ ముద్దుగుమ్మ. అది కూడా 34 ఏళ్ల క్రితం ఆమె నటించిన ఓ క్లాసిక్ సాంగ్‌ కు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఈ అందాల తార ఏం మారలేదంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు ఆపద్భాంధవుడు హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. 1992లో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా ఐదు నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని ప్రతిపాట కూడా ఒక ఆణిముత్యమే అని చెప్పాలి. ప్రధానంగా ‘అవురా అమ్మక చెల్లా’ అయితే ఎవర్ గ్రీన్ క్లాసికల్ సాంగ్. ఇందులో చిరంజీవి, మీనాక్షిల డ్యాన్స్ అద్భుతమని చెప్పవచ్చు. అప్పట్లో కులు మనాలిలో చిత్రీకరించిన ఈ పాటను మళ్లీ ఇప్పుడు మీనాక్షి శేషాద్రి రీక్రియేట్ చేశారు. 62 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మీనాక్షి శేషాద్రి అసలు పేరు శశికళ శేషాద్రి. 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ఆపద్బాంధవుడు సినిమాతో చాలా మందికి ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయారు. దీని తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదీ అందాల తార. ఎక్కువగా హిందీ సినిమాలకే పరిమితమైపోయారు. కాగా 1997 తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు మీనాక్షి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us