
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. అలిపిరి నడక మార్గం నుంచి కొండ మెట్లు ఎక్కి మీనాక్షి చౌదరి అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో హీరోయిన్ మీనాక్షి చౌదరికి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన మీనాక్షి చౌదరిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఇక మీనాక్షి సినిమాల విషయానికొస్తే..
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మీనాక్షి దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి అనగనగ ఒకరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది మీనాక్షి. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.