AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. అవార్డు విన్నింగ్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ మూవీ గతేడాది సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత అమెరికాలో జరిగిన సన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. అంతేకాకుండా గోథెన్‌బర్గ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ స్పెషల్ స్క్రీనింగ్ కు ఎంపికైంది. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ బోల్డ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. అవార్డు విన్నింగ్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Sabar Bonda Movie
Basha Shek
|

Updated on: Feb 06, 2026 | 7:45 PM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఫిబ్రవరి 06) కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. ఇందులో ఒక అవార్డు విన్నింగ్ సినిమా కూడా ఉంది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ బోల్డ్ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఇప్పటివరకు 25 కి పైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ మూవీ ప్రదర్శితమైంది. SXSW లండన్, శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, IFFLA, సన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, గోథెన్‌బర్గ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక వేదికలపై ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి టాలీవుడ్ ప్రముఖ హీరో దగ్గుబాటి రానా స్వయంగా తన స్పిరిట్‌ మీడియా సంస్థ నుంచి ఈ మూవీని డిస్ట్రిబ్యూట్‌ చేయడం విశేషం. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. ఐఎమ్ డీబీలోనూ 7.5 రేటింగ్ దక్కించుకున్న ఈ మూవీ పేరు సబర్‌ బొండా. మొదట ఈ మూవీని క్యాక్టస్‌ పియర్స్‌ అనే పేరు తెరకెక్కించారు.

రోహన్‌ పరశురామ్‌ తెరకెక్కించిన ఈ మరాఠీ చిత్రంలో భూషణ్ మనోజ్, సూరాజ్ సుమన్, జయశ్రీ జగ్తాప్ ప్రధాన పాత్రల్లో నటించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కుల కథగా ఈ సినిమా రూపొందించారు. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితం కావడంతో పలు అవార్డులు గెల్చుకున్న సబర్ బోండా సినిమా శుక్రవారం అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మరాఠి భాషలో మాత్రమే ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న అవార్డ్ విన్నింగ్ మూవీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర