Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

ఒకప్పుడు ఆమె యూత్ ఫేవరేట్. హీరోయిన్ గా, స్పెషల్ పాటలతో అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది. కెరీర్ ఓ రేంజ్ లో ఉన్నప్పుడే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈబ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కమిట్‌మెంట్ ఇవ్వలేదని తనను 30 సినిమాల్లో నుంచి తీసేశారని తెలిపింది.

Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
Mallika Sherawat

Updated on: Dec 12, 2025 | 8:52 PM

సాధారణంగా సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్య అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్స్ చాలా మంది ఈ విషయంపై ఇప్పటికే పలు విషయాలు పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ సైతం కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన ఈ హీరోయిన్.. సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలు పడింది. అలాగే విమర్శలు, అవమానాలు భరించి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ కెరీర్ మొదట్లో కమిట్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల 30 సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయానని తెలిపింది.

ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‏తో క్రేజ్.. క్యాన్సర్‏తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..

కెరీర్ మొదట్లో అవకాశాల పేరుతో తనను ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానించారని తెలిపింది. కానీ తనకు ఇష్టం లేకపోవడంతో ఆ పార్టీలకు వెళ్లలేదని.. దీంతో తనను 20 నుంచి 30 సినిమాల వరకు తీసేశారని.. తొలినాళ్లలో సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయానని తెలిపింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మల్లికా షెరావత్. మర్డర్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మల్లికా షెరావత్ తన బోల్డ్ సన్నివేశాలతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. దీంతో ఆమెకు సినిమాలో అవకాశం ఇవ్వడానికి చాలా మంది నిర్మాతలు క్యూ కట్టారు. సినిమాలో నటించే అవకాశం కావాలంటే నైట్ పార్టీలకు వచ్చి వారితో రాజీ పడాల్సిందేనని.. కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని అన్నారని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది మల్లికా.

అలా పార్టీలకు వెళ్లకపోవడంతో తనను సినిమాల నుంచి తొలగించారని తెలిపింది. కమిట్‌మెంట్‌ను తిరస్కరించడం వల్లే నాకు దాదాపు 30 సినిమాల ఆఫర్లు పోయాయని మల్లికా షెరావత్ అన్నారు. ప్రస్తుతం మల్లికా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఈ బ్యూటీ ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..