ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. తంగలాన్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ మధ్యన ఓ హిందీ సినిమాలోనూ తళుక్కుమందీ అందాల తార. ఇక ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందీ మలయాళ ముద్దుగుమ్మ. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది మాళవిక. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు, వీడియోలను తన ఫాలోవర్లతో పంచుకుంటుంది. ఇక తీరిక దొరికినప్పుడల్లా నెటిజన్లతో ముచ్చటిస్తుంటుందీ అందాల తార. వారు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిస్తుంటుంది. అలా తాజాగా కూడా తన ఫాలోవర్లతో ముచ్చటించింది మాళవిక. ట్విట్టర్ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను పంచుకుంది. అయితే ఇదే సమయంలో ఒక నెటిజన్ దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఓ నెటిజన్ మాళవికాను డైరెక్ట్‌గా మీరు వర్జినా అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మాళవిక.. ‘ఈ రకమైన చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. ఇలాంటివి అడగడం మానేయండి’ అని గట్టిగా ఇచ్చిపడేసింది. దీంతో సదరు నెటిజన్ తన ప్రశ్నను డిలీట్ చేశాడు. ఇక మాళవిక ట్వీట్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం మాళవిక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘ది రాజా సాబ్’సినిమాలో నటిస్తోంది. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల మరో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్, సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, రిద్ది కుమార్, మురళీ శర్మ, జరీనా వాహబ్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, యోగిబాబు, వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రభాస్ ది రాజా సాబ్ తో పాటు కార్తీ సర్దార్ 2లోనూ హీరోయిన్ గా నటిస్తోంది మాళవికా మోహనన్. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.
మాళవిక ట్వీట్..
To these kind of dirty questions I’m not. https://t.co/iHsq6x3sgJ
— Malavika Mohanan (@MalavikaM_) March 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి