Malavika Mohanan: ప్రభాస్, మారుతి సినిమా షూటింగ్ వీడియో.. విలన్స్‏ను ఉతికారేసిన మాళవిక..

సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్ని ప్రభాస్ తదుపరి చిత్రాలపైనే ఉన్నాయి. ఓవైపు సలార్, కల్కి చిత్రాలు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. గతంలో ఈ సినిమాల నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఓ రెంజ్ లో క్యూరియాసిటిని పెంచేశాయి. మరోవైపు ఎలాంటి అప్డేట్స్ లేకుండా సైలెంట్‏గా షూటింగ్ జరుపుకుంటుంది డీలక్స్ రాజా ప్రాజెక్ట్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా గురించి ఇప్పటివరకు అఫీషియల్‏గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.

Malavika Mohanan: ప్రభాస్, మారుతి సినిమా షూటింగ్ వీడియో.. విలన్స్‏ను ఉతికారేసిన మాళవిక..
Malavika Mohanan, Prabhas

Updated on: Sep 16, 2023 | 9:02 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన చిత్రాలన్ని అభిమానులను అంతగా మెప్పించలేకపోయాయి. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ టాక్ అందుకున్నాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్ని ప్రభాస్ తదుపరి చిత్రాలపైనే ఉన్నాయి. ఓవైపు సలార్, కల్కి చిత్రాలు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. గతంలో ఈ సినిమాల నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఓ రెంజ్ లో క్యూరియాసిటిని పెంచేశాయి. మరోవైపు ఎలాంటి అప్డేట్స్ లేకుండా సైలెంట్‏గా షూటింగ్ జరుపుకుంటుంది డీలక్స్ రాజా ప్రాజెక్ట్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా గురించి ఇప్పటివరకు అఫీషియల్‏గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.

ఈ సినిమాకు డీలక్స్ రాజా, వింటేజ్ కింగ్ అనే పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ తోపాటు మరో ముద్దుగుమ్మ కూడా ఉండనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. మరోవైపు ప్రభాస్ కొన్ని యాక్షన్స్ సీన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో హీరోయిన్స్ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని టాక్. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ యాక్షన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలో హీరోయిన్ మాళవిక స్టంట్స్ చేస్తూ కనిపిస్తోంది. దీంతో ఇటు రొమాంటిక్, గ్లామర్ సీన్స్ మాత్రమే కాదు.. యాక్షన్ సీన్స్ కూడా అదరగొడుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉండడంతో.. ఆయన లేరని మిగతా షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్ మారుతీ. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, జరీనా వహాబ్ లాంటి నటులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీ ఫుల్ కామెడీ జోనర్ లో సాగుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.