Malashree: అలనాటి హీరోయిన్‌ మాలాశ్రీ కూతురును చూశారా? అందంలో అచ్చం అమ్మలాగే.. త్వరలోనే హీరోయిన్‌గా..

సినిమాల సంగతి పక్కన పెడితే.. మాలాశ్రీ సునీల్ అనే నటుడిని ప్రేమించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మాలా శ్రీ, సునీల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మాలా శ్రీ గాయాలతో బయటపడగా సునీల్‌ మాత్రం కన్నుమూశాడు. ఆ తర్వాత నిర్మాత రామును వివాహం చేసుకున్నారీ కన్నడ డ్రీమ్‌ గర్ల్. అయితే కరోనా సమయంలో ఆయన కూడా కన్నుమూశారు.

Malashree: అలనాటి హీరోయిన్‌ మాలాశ్రీ కూతురును చూశారా? అందంలో అచ్చం అమ్మలాగే.. త్వరలోనే హీరోయిన్‌గా..
Actress Malashree

Updated on: Jun 03, 2023 | 9:52 AM

ఒకప్పుడు తెలుగు నాట స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందారు మాలాశ్రీ. గ్లామర్‌తో పాటు అభినయానికి ఉన్న పాత్రలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సుమన్‌ కాంబినేషన్‌లో మాలాశ్రీ చేసిన సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఘరానా అల్లుడు, బావ బావమరిది, తోడి కోడళ్లు, ప్రేమ ఖైదీ, పోలీస్ అల్లుడు, సాహస వీరుడు సాగర కన్య తదితర హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించారు. మాలాశ్రీ. చెన్నైకు చెందిన మాలాశ్రీ తమిళ్‌, కన్నడ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందారు. కన్నడ ప్రేక్షకులైతే ఆమెకు ఏకంగా డ్రీమ్‌ గర్ల్‌ అని బిరుదు ఇచ్చేశారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. మాలాశ్రీ సునీల్ అనే నటుడిని ప్రేమించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మాలా శ్రీ, సునీల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మాలా శ్రీ గాయాలతో బయటపడగా సునీల్‌ మాత్రం కన్నుమూశాడు. ఆ తర్వాత నిర్మాత రామును వివాహం చేసుకున్నారీ కన్నడ డ్రీమ్‌ గర్ల్. అయితే కరోనా సమయంలో ఆయన కూడా కన్నుమూశారు.

కాగా రాము, మాలాశ్రీ దంపతులకు రాథనా రామ్‌ అనే కూతురుంది. త్వరలోనే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. కన్నడ ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్ హీరోగా నటిస్తోన్న కాటేరి అనే సినిమాతో వెండితెరకు పరిచయం కానుంది రాథన. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తెలుగు,కన్నడ , మలయాళం, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తరుణ్ సుధీర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సినిమాల సంగతి పక్కన పెడితే రాథనా రామ్‌ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. అందంలో అచ్చం అమ్మలాగే ఉందంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి మాలాశ్రీ కూతురు లేటెస్ట్‌ ఫొటోలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..