Khushbu Sundar : కరోనా వైరస్ సెల్రబిటీల వెంటే పడుతుంది. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలను చుట్టేసిన ఈ మహమ్మారి… ఇప్పుడు సౌత్ ఇండియన్ సెలబ్రిటీల వెనక పడుతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినిమాతారలు కూడా కరోనా బారిన పడటంతో సామాన్య ప్రజలు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే బీటౌన్‌లో ఏక్తా కపూర్, అర్జున్ కపూర్, స్వరా భాస్కర్, సింగర్ విశాల్ డడ్లానీతో పాటు టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, మనోజ్ , తమన్ , త్రిష, వరలక్ష్మీ శరత్ కుమార్, రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరోయిన్ కుష్బూకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.
మొత్తానికి కరోనా వచ్చేసింది. గత రెండు వేవ్ నుంచి తప్పించుకుంటున్నా మొత్తానికి నన్ను చేరుకుంది. నిన్న సాయంత్రం వరకు నాకు ఎలాంటి లక్షణాలు లేవు. తర్వాత కాస్త జలుబు చేసింది. దాంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నా.. ఒంటరి గా ఉండటం బోర్.. కాబట్టి రాబోయే 5 రోజులు నన్ను ఎంటర్టైన్ చేయండి అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు కుష్బూ. ఇక కుష్బూ కరోనా బారిన పడటంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Ok. finally #Covid catches up with me after dodging last 2 waves. I have just tested positive. Till last eve i was negative. Have a running nose,did a test n Voila! I have isolated myself. Hate being alone. So keep me entertained for the next 5 days. N get tested if any signs ?
— KhushbuSundar (@khushsundar) January 10, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :