Thug Life: తల్లి తోపు హీరోయిన్.. కూతురేమో అసిస్టెంట్ డైరెక్టర్.. థగ్ లైఫ్ సినిమాకు పనిచేసిన ఈ అమ్మడు ఎవరంటే..

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ థగ్ లైఫ్. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇందులో శింబు, త్రిష, అభిరామి, ప్రకాష్ వర్మ కీలకపాత్రలు పోషించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఓ స్టార్ హీరోయిన్ కూతురు పనిచేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Thug Life: తల్లి తోపు హీరోయిన్.. కూతురేమో అసిస్టెంట్ డైరెక్టర్.. థగ్ లైఫ్ సినిమాకు పనిచేసిన ఈ అమ్మడు ఎవరంటే..
Kushbu

Updated on: Jun 06, 2025 | 9:51 AM

సౌత్ ఇండస్ట్రీలో మరోసారి హిట్ కాంబో రిపీట్ అయ్యింది. నాయగన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దాదాపు 30 ఏళ్లకు డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన చిత్రం థగ్ లైఫ్. దీంతో విడుదలకు ముందు నుంచే ఈ చిత్రంపై విపరీతమైన బజ్ ఏర్పడింది. ఇందులో త్రిష, శింబు, అభిరామి కీలకపాత్రలు పోషించారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈసినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మణిరత్నం మార్క్ మిస్సైందంటూ కామెంట్స్ వచ్చినప్పటికీ కమల్, త్రిష, శింబు యాక్టింగ్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళం, తెలుగు భాషలలో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ఓ స్టార్ హీరోయిన్ కూతురు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? కొన్నాళ్లుగా డైరెక్టర్ మణిరత్నం వద్ద ఆమె సహాయ దర్శకురాలిగా పనిచేస్తుంది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఖుష్బూ చిన్న కూతురరు అనందిత. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా దూసుకుపోయింది ఖుష్బూ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. చిరంజీవి, వెంకటేశ్, రజినీ, కమల్, ప్రభు, విజయ్ కాంత్, సత్యరాజ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టిన ఖుష్బూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయ నటిగా కనిపిస్తున్నారు. స్టార్ హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా కనిపిస్తున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే డైరెక్టర్ సుందర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు అవంతిక, అనందిత. పెద్ద కూతురు విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తుండగా.. చిన్న కూతురు అనందిత మేకప్, బ్యూటీ రంగంలో రాణిస్తున్నారు. అయితే ఖుష్బూ చిన్న కూతురు ఇప్పుడు సినీరంగంలోకి అడుగుపెట్టింది.

కొన్నాళ్లుగా డైరెక్టర్ మణిరత్నం దగ్గర సహయ దర్శకురాలిగా పనిచేస్తుంది. ఇటీవల విడుదలైన థగ్ లైఫ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది. నిన్న విడుదలైన థగ్ లైఫ్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్స్ జాబితాలో అనందిత పేరు ఉన్న ఫోటోను ఖుష్బూ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. “ఒక తల్లిగా, నా కూతురు మణిరత్నం శిష్యురాలుగా ఒక సినిమాకు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురు కాలు ఫ్యాక్చర్ కావడం వల్ల థగ్ లైఫ్ సినిమాకు ఎక్కువగా పనిచేయలేకపోయింది. కానీ కొంతకాలంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. కానీ, ఆమె సేకరించిన జ్ఞానం, మణి సర్ నుండి నేర్చుకున్న విషయాలు జీవితాంతం నిలిచి ఉంటాయి. ఆ అనుభవం నా కూతురికి నిజంగా ఎంతో ఆనందాన్నిచ్చిందని నేను చెప్పాలి. మణిరత్నం చూపిన గొప్ప మనసుకు, సినిమా చివర్లో నా కూతురి పేరును చేర్చడం మర్చిపోలేదు. ఆయనకు నా కృతజ్ఞతలు” అంటూ రాసుకోచ్చింది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..