జైల్లో నన్ను అలా చేశారు.. అది నన్ను ఎంతో కలిచివేసింది.. కస్తూరి ఎమోషనల్ కామెంట్స్

అన్నమయ్య సినిమాలో నాగార్జున మరదలిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది కస్తూరి శంకర్‌. ఈ సినిమాతో పాటు బాలయ్య నిప్పురవ్వ, మోహన్‌బాబు సోగ్గాడి పెళ్లాం, రాజశేఖర్ మా ఆయన బంగారం, రథయాత్ర తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.

జైల్లో నన్ను అలా చేశారు.. అది నన్ను ఎంతో కలిచివేసింది.. కస్తూరి ఎమోషనల్ కామెంట్స్
Kasthuri Shankar

Updated on: Jan 09, 2026 | 5:19 PM

కింగ్ నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాతో కస్తూరి శంకర్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు కస్తూరి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు.  కేవలం తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూనే.. మరోవైపు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇప్పుడు వరుసగా సీరియల్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది కస్తూరి. గతంలో ఆమె అనుకోని వివాదాల కారణంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కొన్ని రోజుల పాటు ఆమె జైలు జీవితం అనుభవించింది.

మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే

గతంలో ఓ ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటి కస్తూరి శంకర్ తన జైలు జీవితంలోని వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఆమె జైలులో ఉన్నప్పుడు ఒంటరితనం తనను ఎంతగానో కలచివేసిందని, ఆ రాత్రంతా ఎలా గడిచిందో తెలియక పదే పదే ప్రశ్నించుకున్నానని తెలిపారు. జైలులోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆభరణాలు లేదా ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించరని కస్తూరి వెల్లడించారు. లోపలికి వెళ్లడమే ఒక పెద్ద సాహసమని ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని

జైలులోకి వెళ్ళేటప్పుడు స్ట్రిప్ సెర్చ్ చేస్తారని అని కస్తూరి తెలిపారు. ఈ స్ట్రిప్ సెర్చ్ లో ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఎలా ఉంటాడో అలానే ఉండాలని, అంటే శరీరంతో పాటు ఎటువంటి వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి ఉండదని ఆమె అర్థం వివరించారు. మహిళా ఖైదీల కోసం ఈ తనిఖీని మహిళా సిబ్బందే నిర్వహిస్తారని ఆమె తెలిపారు. శరీరంపై ఎక్కడైనా, పళ్లలో, లేదా శరీరంలోని సున్నితమైన భాగాలలో ఏదైనా దాచి ఉంచారా అని క్షుణ్ణంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా, మూడు సార్లు కూర్చొని నిలబడమని (స్క్వాట్స్) అడుగుతారని, ఇది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని తెలిపారు కస్తూరి. ఈ ప్రక్రియ మానసికంగా చాలా కష్టమైనదని కస్తూరి అన్నారు, అయినప్పటికీ ఇది జైలు నిబంధనలలో ఒక భాగమని ఆమె చెప్పుకొచ్చారు.

ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.