AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దర్శకుడికి స్విమ్ సూట్ ఫోటోలు పంపించా.. కానీ వేరే హీరోయిన్‌ను సెలక్ట్ చేశారు

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ రాణించాలని ఎంతో మంది ఎన్నో ఆశలతో అడుగుపెడుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. కొంతమంది హీరోయిన్స్ గా ఛాన్స్ లు అందుకున్నా ఎక్కువ కాలం రాణించలేరు. ఆతర్వాత సహాయక పాత్రలకు షిఫ్ట్ అవుతుంటారు.

దర్శకుడికి స్విమ్ సూట్ ఫోటోలు పంపించా.. కానీ వేరే హీరోయిన్‌ను సెలక్ట్ చేశారు
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2026 | 12:23 PM

Share

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం అంత ఈజీ కాదు. చాలా మంది హీరోయిన్ సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఒక్కసారి హీరోయిన్ గా అవకాశం అందుకుంటే దాని కొనసాగించడం కూడా కష్టమే.. చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే మెప్పిస్తున్నారు. హీరోయిన్స్ గా చేసినప్పటికీ ఆతర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో సహాయక పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఓ ముద్దుగుమ్మ కూడా ఒకప్పుడు  హీరోయిన్ గా చేసి ఆ తర్వాత సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అంతే కాదు ఆమె ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ కోసం దర్శకుడికి ఏకంగా బికినీ ఫోటోలను పంపించిందట. ఇంతకూ ఆమె ఎవరో ఒక్కసారి చూద్దాం.!

ఇది కూడా చదవండి: 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

ప్రముఖ నటి కస్తూరి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన విశేషాలను, తన పాత్రల ఎంపిక వెనుక ఉన్న కథనాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా, భారతీయుడు చిత్రానికి సంబంధించి దర్శకుడు శంకర్‌కు బికినీ ఫొటోలు పంపిన విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆమెను మొదట ఊర్మిళా పాత్రకు పరిశీలించారని, ఆ పాత్రకు సరిపోతారా అని చూడటానికి స్విమ్ సూట్ పిక్చర్స్ పంపమని కోరారని కస్తూరి తెలిపారు. అయితే, అదే సమయంలో రంగీలా సినిమా ట్రైలర్ విడుదలవడంతో, ఊర్మిళకు ఆ పాత్ర దక్కిందని తెలిపారు.. లేకపోతే ఆ పాత్రలో తాను ఉండేదాన్ని అని తెలిపారు. అదృష్టవశాత్తు, భారతీయుడు చిత్రంలో కస్తూరికి మరొక ముఖ్యమైన పాత్ర లభించింది. ఈ పాత్ర ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

“పచ్చని చిలుకలు తోడుంటే” అనే పాటలో ఆమె నటన కమల్ హాసన్, మనీషా కొయిరాలా, ఊర్మిళ వంటి స్టార్ల కంటే కూడా కస్తూరికే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ పాత్ర ఆమె సినీ జీవితంలో ఒక మలుపు తిప్పిందని తెలిపారు. భారతీయుడు తర్వాత, కస్తూరి ఇతర గ్లామరస్ పాత్రలలో కూడా నటించే ప్రయత్నం చేశారు. తెలుగులో కొన్ని చిత్రాలలో పూర్తి గ్లామరస్ రోల్స్ చేసినప్పటికీ, ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని అన్నారు. ప్రేక్షకులు తనను అన్నమయ్య కస్తూరి, భారతీయుడు కస్తూరి, గృహలక్ష్మి కస్తూరి వంటి సంప్రదాయబద్ధమైన, హోమ్లీ పాత్రల ద్వారానే ఎక్కువగా గుర్తుంచుకుంటారని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి: ఇద్దరితో ఎఫైర్, ఇద్దరితో విడాకులు..!ఈ టాలీవుడ్ హీరో మామూలోడు కాదు గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us